ఎయిర్ పోర్ట్‌లో రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన హీరోయిన్.. అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూర్‌లో కన్నడ హీరోయిన్ రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడడం సంచలనం రేపింది. దుబాయ్ నుంచి బెంగళూర్‌కు 15 కేజీల బంగారన్ని స్మగ్లింగ్ చేస్తూ DRI అధికారులకు పట్టుబడ్డారు రన్యా రావు.15 కేజీల బంగారంతో రన్యా రావు పట్టుబడింది. ప్రస్తుతం రన్యా రావును DRI అధికారులు ప్రశ్నిస్తున్నారు.

బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్ట్ చేశారు పోలీసులు. దుబాయ్ నుంచి బెంగళూర్‌కు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 15 కేజీల బంగారంతో రన్యా రావు పట్టుబడింది. ప్రస్తుతం రన్యా రావును DRI అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా తాను డీజీపీ కూతురిని అని రన్యా రావు ప్రచారం చేసుకుంటుంది. కన్నడలో సుదీప్‌తో మాణిక్య సినిమాలో నటించింది రన్యా.
కన్నడ చిత్రం ‘మాణిక్య’లో నటించిన రన్యా రావు అక్రమ బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై పట్టుబడ్డారు దుబాయ్ నుంచి వచ్చిన ఆమె ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14.8 కిలోల బంగారంతో పట్టుబడింది. నటి రన్యా రావు తరచుగా దుబాయ్ వెళ్తూ ఉండేది. అలాగే ఈసారి కూడా వెళ్లి మార్చి 3వ తేదీ రాత్రి తిరిగి దుబాయ్ నుంచి వచ్చింది. ఆమె పై అనుమానం తో అధికారులు ఆమెను చెక్ చేశారు.
బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్న DRI అధికారులు చెక్ చేయగా.. ఆమె దుస్తులలో 14.8 కిలోల బంగారం కనిపించింది. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. రన్యా రావు ఈ రకమైన బంగారం అక్రమ రవాణాకు అనేక సందర్భాల్లో పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




