
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రంభ. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా..తమిళం, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఆమె.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. పదిహేనేళ్ల వయసులోనే హీరోయిన్ గా అడుగుపెట్టిన రంభకు.. అప్పట్లో భారీగా ఫాలోయింగ్ ఉండేది. తమిళంలో రజినీకాంత్, అజిత్, విజయ్, హిందీలో సల్మాన్ ఖాన్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ను వివాహం చేసుకున్నారు రంభ. పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.. ఓబాబు ఉన్నారు.
అయితే సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు రంభ. తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటారు. ఇక తాజాగా రంభ తన పెద్ద కూతురి ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేశారు. అచ్చ తెలుగు ఆడపిల్లగా ముస్తాబయిన రంభ కూతురు పేరు లాన్య ఇంద్రకుమార్.
ఆమె చేతిలో బహుమతులు పట్టుకుని ఓ వేదికపై నిల్చున్న ఫోటోస్ షేర్ చేసింది రంభ. ప్రస్తుతం ఆ చిన్నారి ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. అచ్చం తల్లిలాగే ఉందని.. బుట్టుబొమ్మలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.