
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే పెళ్లయ్యాక మాత్రం తన మకాంను బాలీవుడ్ కు మార్చేసింది. ఇప్పుడు అక్కడే వరుసగా సినిమాలు చేస్తోందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే ఫిట్‌నెస్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది రకుల్. జిమ్, యోగా, పైలేట్స్ , కార్డియో, రన్నింగ్, హైకింగ్, గోల్ప్ ఇలా వివిధ రకాల వర్కౌట్స్ చేస్తుంటుంది. చేయడమే కాదు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తద్వారా తన ఫాలోవర్లకు హెల్త్ అండ్ ఫిట్ నెస్ పై అవేర్ నెస్ కల్పిస్తోంది. తాజాగా ఫిట్ నెస్ రొటీన్‌కు సంబంధించి రకుల్ మరో ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేసింది. మనం పెద్దగా పట్టించుకోని ‘చిన్న కండరాలకు’ కూడా ప్రాధాన్య ఇవ్వాలని, వాటి దృఢత్వం కోసం తగిన వ్యాయామాలు చేయాలని సూచించింది. ఇక మరో వీడియోలో అద్భుతమైన బాలెన్సింగ్‌తో ఆక్వా బాల్ ఎక్సర్ సైజ్ చేసి చూపించింది రకుల్.
‘ఈ ట్రైనింగ్‌లో చిన్న కండరాలను బలోపేతం చేయడంతో పాటు, బరువులు ఎత్తడం అంతే ముఖ్యం. మొదట్లో బోసు బాల్‌పై కూడా బ్యాలెన్స్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఈ స్మాల్ వాటర్ బాల్ పై సులువుగా బ్యాలెన్స్ చేస్తున్నా’ అని చెప్పుకొచ్చంది రకుల్. ఈ వీడియోలో ముందు తన చేతులను ఫ్రీగా వదిలేసి బ్యాలెన్స్ చేయగా, ఆ తరువాత చేతులను కలిపి ఉంచి, ఒంటి కాలిపై సింగిల్-లెగ్ స్క్వాట్స్, ఫ్లూయిడ్ బాల్‌పై తన బాడీని బాలెన్స్ చేసింది. ఈ సారి జిమ్‌కి వెళ్లినప్పుడు ఇలా ప్రయత్నించండి అంటూ తన ఫాలోవరకు సూచించింది. రకుల్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..