Poonam Kaur: షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన పూనమ్.. ఆ అరుదైన జబ్బుతో బాధపడుతున్నానంటూ..
ప్రముఖ నటి పూనమ్ కౌర్ తన అభిమానులకు ఓ షాకింగ్ విషయం చెప్పింది. చేసిందే కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఫైబ్రో మైయాల్జియా అనే ఓ అరుదైన జబ్బుతో బాధపడుతోందట.
మొన్న సమంత.. నిన్న కల్పిక..తాజాగా పూనమ్ కౌర్.. తమకున్న అనారోగ్య సమస్యలు, జబ్బులను ధైర్యంగా బయటపెట్టి అవగాహన కల్పిస్తున్నా అందాల తారల జాబితా ఇది. మయోసైటిస్ అనే అరుదైన జబ్బుతో బాధపడుతున్నట్లు ప్రముఖ నటి సమంత ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఆతర్వాత కల్పికా గణేష్ కూడా ఇదే సమస్యతో సతమతమవుతున్నట్లు తెలిపింది. తాజాగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ తన అభిమానులకు ఓ షాకింగ్ విషయం చెప్పింది. చేసిందే కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఫైబ్రో మైయాల్జియా అనే ఓ అరుదైన జబ్బుతో బాధపడుతోందట. సుమారు రెండేళ్లుగా ఈ సమస్యతో సతమతమవుతోన్న పూనమ్ ప్రస్తుతం దీనిక కోసం కేరళలో చికిత్స తీసుకుంటోందట. తాజాగా తన ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా..
ఫైబ్రో మైయాల్జియా కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతోందట పూనమ్. ఈ వ్యాధి నయం కావడానికి కేరళలోని ఆయుర్వేద నిపుణులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారట. మొదట తన జబ్బుకు చికిత్స కోసం పలు ఆస్పత్రులు తిరిగిందట పూనమ్. అయితే నయం కాకపోవడంతో కేరళ ఆయుర్వేద వైద్యులను సంప్రదించిందట. వారు ఆమెను పరిశీలించి ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన జబ్బు ఉన్నట్లు తేల్చారట. ప్రస్తుతం కేరళలోనే ఉంటూ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోందామె. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్సర్ సైజ్, టాకింగ్ థెరఫీ కూడా తీసుకుంటోందట. ప్రస్తుతం ఈ చికిత్స మెరుగైన ఫలితాలను అందిస్తోందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని పూనమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట.
రాహుల్‌తో కలిసి..
నటించింది కొన్ని సినిమాలే అయినా తన అందం, అభినయంతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూనమ్‌కౌర్. ఎస్వీ కృష్ణారెడ్డి, శ్రీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన మాయాజాలం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, గగనం, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, ఈనాడు, గణేష్, నాగవల్లి, పయనం, గమనం తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేనత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..