Pooja Hegde: కాంతార సినిమాపై బుట్టబొమ్మ రివ్యూ.. ఆ 20 నిమిషాలు రోమాలు నిక్కబోడుచుకున్నాయంటూ..

రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందంటూ ఇప్పటికే పలువురు నటీనటులు తమ అభిప్రాయాలను తెలిపారు.

Pooja Hegde: కాంతార సినిమాపై బుట్టబొమ్మ రివ్యూ.. ఆ 20 నిమిషాలు రోమాలు నిక్కబోడుచుకున్నాయంటూ..
Pooja Hegde

Updated on: Oct 24, 2022 | 5:22 PM

కాంతార… ఇప్పుడు దేశవ్యా్ప్తంగా ప్రతిచోట వినిపిస్తున్న పేరు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. దీంతో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేసింది హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ. ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ అందుకుంటూ భారీగా కలెక్షన్స్ రాబడుతుంది కాంతార. రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందంటూ ఇప్పటికే పలువురు నటీనటులు తమ అభిప్రాయాలను తెలిపారు. తాజాగా టాలీవుడ్ బుట్టబొమ్మ కాంతార సినిమాకు రివ్యూ ఇచ్చింది. ఈ సినిమా అత్యద్భుతంగా ఉందని.. ఓ ప్రాంతీయ సంస్కృతిని అందరికీ చేరువయ్యేలా తీర్చిదిద్దారని ఆమె అన్నారు. ఈ మేరకు తన ఇన్ స్టా వేదికగా కాంతార సినిమా గురించి ఆసక్తిక కామెంట్స్ చేసింది.

” మీకు ఏం తెలుసో.. అదే కథగా రాయండి. మీ మనసుకు చేరువైన.. మీ హృదయంలో నుంచి వచ్చిన కథలనే ప్రేక్షకులకు చెప్పండి. ముఖ్యంగా ఈ సినిమాలోని చివరి 20 నిమిషాలకు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. విజువల్స్, నటీనటుల ప్రదర్శనకు చలించిపోయా. రిషబ్ శెట్టి.. కాంతార విశేషమైన ఆదరణ పొందుతున్నందుకు గర్వంగా ఉంది. నా చిన్నతనంలో చూసిన భూతకోలని ఎంతో అద్భుతంగా చూపించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నావు. రానున్న రోజుల్లో నువ్వు మరెన్నో ప్రశంసలు అందుకోవాలి. ” అంటూ రాసుకొచ్చారు పూజా.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను కర్ణాటక, కేరళలో విస్తరించి ఉన్న తుళునాడు ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. స్థానిక గ్రామదేవతలను పూజించే భూతకోల సంస్కృతిని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 188 కోట్లకు పైగా వసూళు చేసి 200 కోట్లకు చేరువలో ఉంది.

Pooja Hegde, Kantara

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.