Paayal Rajput: హీరోయిన్‌ కాకపోయి ఉంటే? నెటిజన్‌ ప్రశ్నకు పాయల్‌ ఏం రిప్లై ఇచ్చిందంటే?

ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రాళ్ల హృదయాల్లో కలకలం రేపింది పంజాబీ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌(Paayal Rajput).  ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఆఫర్లు భారీగానే వచ్చాయి. విక్టరీ వెంకటేశ్‌తో వెంకీమామ, రవితేజతో డిస్కోరాజా సినిమాల్లో సందడి చేసింది.

Paayal Rajput: హీరోయిన్‌ కాకపోయి ఉంటే? నెటిజన్‌ ప్రశ్నకు పాయల్‌ ఏం రిప్లై ఇచ్చిందంటే?
Paayal Rajput
Follow us
Basha Shek

|

Updated on: Aug 19, 2022 | 6:42 PM

ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రాళ్ల హృదయాల్లో కలకలం రేపింది పంజాబీ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌(Paayal Rajput).  ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఆఫర్లు భారీగానే వచ్చాయి. విక్టరీ వెంకటేశ్‌తో వెంకీమామ, రవితేజతో డిస్కోరాజా సినిమాల్లో సందడి చేసింది. తమిళ్‌, పంజాబీ సినిమాలతో పాటు కొన్ని వెబ్‌సిరీస్‌ల్లోనూ మెరిసింది. ఈ సొగసరి నటించిన తాజా చిత్రం తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan). యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ (Aadi Sai Kumar) హీరోగా నటించాడు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించింది పాయల్‌. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చింది. అదేవిధంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ట్విట్టర్‌ వేదికగా చిట్‌ చాట్ నిర్వహించిన ఈ అందాల తారను ‘ఒక‌వేళ మీరు హీరోయిన్‌ కాక‌పోయి ఉంటే ఏం చేసేవారు’ అని ఓ నెటిజన్‌ అడిగాడు. దీనికి స్పందించిన ఆమె తాను జ‌ర్నలిజం చేశానని.. కాబట్టి న్యూస్ యాంక‌ర్ అయ్యేదాన్నని రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న జిన్నా చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కిరాతక, ఏంజెల్‌ (తమిళ్), హెడ్ బుష్ (కన్నడ) చిత్రాల్లోనూ కనిపించనుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..