Nayanthara: తెలుగులోకి నయనతార హారర్ థ్రిల్లర్.. కనెక్ట్ రిలీజ్ ఎప్పుడంటే? ..

|

Dec 06, 2022 | 8:30 AM

హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన "మయూరి" సినిమా తెలుగులో భారీ విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన

Nayanthara: తెలుగులోకి నయనతార హారర్ థ్రిల్లర్.. కనెక్ట్ రిలీజ్ ఎప్పుడంటే? ..
Nayanthara
Follow us on

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయన్.. ఇప్పుడు కనెక్ట్ మూవీతో థియేటర్లలో సందడి చేయనుంది. ఆమె కథానాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” సినిమాను యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నయన్ భర్త విఘ్నేష్ శివన్ నిర్మించారు. దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన “మయూరి” సినిమా తెలుగులో భారీ విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన “గేమ్ ఓవర్” కూడా సూపర్ హిట్టయ్యింది. కనెక్ట్ చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్‌ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. అనుపమ్‌ ఖేర్‌తోపాటు సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – పృథ్వి చంద్రశేఖర్‌ అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమానే కాకుండా.. తమిళ్ డైరెక్టర్ అట్లీ.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలోనూ నయన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.