Nayanthara: నయనతారకు మరో షాక్.. రూ. 5 కోట్లు చెల్లించాలని నోటీసులు.. ఏం జరిగిందంటే?

సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె భర్త విఘ్నేష్ తో విడాకులు తీసుకుంటోందన్న రూమర్లు వినిపించాయి. ఈ ప్రచారం జరుగుతుండగానే ఈ అందాల తారకు ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది.

Nayanthara: నయనతారకు మరో షాక్.. రూ. 5 కోట్లు చెల్లించాలని నోటీసులు.. ఏం జరిగిందంటే?
Nayanthara

Updated on: Jul 08, 2025 | 7:45 PM

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఈ అందాల తారకు ఉంది. రెమ్యునరేషన్ విషయంలోనూ ఈ ముద్దుగుమ్మ టాప్ లో కొనసాగుతోంది. అయితే ఈ అమ్మడి లైఫ్ లో వివాదాలు కూడా ఎక్కువే. కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నా ప్రమోషన్లకు రాదన్న విమర్శలు ఎదుర్కొంది. అలాగే పలు వివాదాల్లోనూ ఈ అమ్మడి పేరు బాగా వినిపించింది. నయనతార దర్శకుడు విఘ్నేష్‌ను వివాహం చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. అయితే ఇటీవల నయనతార షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లిపై కామెంట్స్ చేయడంతో ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటోందని ప్రచారం సాగింది. ఈ రూమర్లు కొనసాగుతుండగానే నయన తారకు మరో బిగ్ షాక్ తగిలింది. అదేంటంటే.. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన నయనతార డాక్యుమెంటరీపై నటుడు ధనుష్ కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే.
తన సినిమాలోని సీన్స్ వాడుకున్నందుకు ధనుష్ నిర్మాణ సంస్థ భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తూ కేసు దాఖలు చేసింది. ఇప్పుడు అదే డాక్యుమెంటరీపై మరో నిర్మాణ సంస్థ ఐదు కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసు పంపింది.

 

నయనతార జీవితం గురించి తెరకెక్కిన ఒక డాక్యుమెంటరీ కొన్ని నెలల క్రితం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. దీనికి రెస్పాన్స్ ఎలా ఉందని సంగతి పక్కన పెడితే.. ఈ డాక్యుమెంటరీపై అనేక వివాదాలు తలెత్తాయి. గతంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ డా’ సినిమాలో నయనతార నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నయనతార, విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. అందుకే ఆ సినిమా షూటింగ్ లోని కొన్ని సన్నివేశాలను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. దీంతో ఈ సినిమాను నిర్మించిన ధనుష్ నయనతారకు భారీ మొత్తంలో పరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపాడు.కాగా నయనతార నటించిన అనేక ఇతర చిత్రాల దృశ్యాలను కూడా అదే డాక్యుమెంటరీలో ఉపయోగించారు. ఇప్పుడు, మరో చిత్ర నిర్మాణ సంస్థ ఐదు కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేస్తూ డాక్యుమెంటరీ నిర్మాతలకు నోటీసు పంపింది.

ఇవి కూడా చదవండి

‘నయనతార’ డాక్యుమెంటరీలో రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కూడా ఉపయోగించారు. దీంతో ఈ సినిమా హక్కులను కలిగి ఉన్న ఏపీ ఇంటర్నేషనల్స్ ఇప్పుడు నయనతారకు నోటీసు పంపింది. తమ అనుమతి లేకుండా సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించడం ద్వారా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని వారు ఆరోపించారు. ధనుష్ నిర్మాణ సంస్థ నయనతారపై ఫిర్యాదు చేసినప్పుడు, ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ ధనుష్ ఘాటైన విమర్శలు చేసింది. మరి దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.