AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: అలాంటి పాటలలో నటించి తప్పుచేశాను.. ఇబ్బంది పెట్టాయి.. టాలీవుడ్ హీరోయిన్..

ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో చక్రం తిప్పిన హీరోయిన్లలో ఆమె ఒకరు. కథానాయికగా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఆ బ్యూటీ.. ఆ తర్వాత స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. తెలుగులో అనేక చిత్రాల్లో అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు సినిమాలు మానేసి దైవచింతనలో గడిపేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress: అలాంటి పాటలలో నటించి తప్పుచేశాను.. ఇబ్బంది పెట్టాయి.. టాలీవుడ్ హీరోయిన్..
Mumtaz
Rajitha Chanti
|

Updated on: Sep 25, 2025 | 11:35 AM

Share

హీరోయిన్లుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే స్టార్ డమ్ సంపాదించుకుంటారు. ఒకటి రెండు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటారు. హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు.. ఆ తర్వాత స్పెషల్ పాటలతో దూసుకుపోతుంటారు. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలతో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? అప్పట్లో ఈ అమ్మడు సెన్సేషన్. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ గ్లామరస్ స్టెప్పులతో ఇరగదీసింది. కానీ.. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేసి తప్పుచేశానంటుంది. ఆ పాటలే తనను ఇబ్బంది పెడుతున్నాయని అంటుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ.. ఇప్పుడు మాత్రం దైవచింతనలో గడిపేస్తుంది. ఆమె ఎవరో కాదు.. ఒకప్పటి హీరోయిన్ ముంతాజ్.

ముంబైకి చెందిన ముంతాజ్ (నగ్మా ఖాన్) మొదట తమిళ సినిమాతో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత దాదాపు 16 ఏళ్లు తెలుగు సినిమాల్లో రాణించింది. ఎక్కువగా స్పెషల్ పాటలతో గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో గ్లామర్ పాటలతో రచ్చ చేసింది. వంశీ అనుమానాస్పదం, ఖుషి, అత్తారింటికి దారేది వంటి చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. 21 ఏళ్ల వయసులోనే గ్లామర్ స్టెప్పులతో కుర్రకారును ఊర్రూతలూగించింది. 1999లో తెలుగు, తమిళ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. చాలా బాగుంది, అమ్మో ఒకటో తారీఖు, ఖుషి, జెమినీ, కూలీ, కొండవీటి సింహాసనం, అత్తారింటికి దారేది, ఆగడు వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చివరగా 2015లో టామీ అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..

ఇవి కూడా చదవండి

సినిమాలకు దూరంగా ఉంటున్న ముంతాజ్.. ఇప్పుడు దైవచింతనలో ఉంటుంది. మొదట్లో తనకు ఖురాన్ అర్థం తెలియదని.. కానీ అర్థమైన తర్వాత తనలో మార్పు వచ్చిందని తెలిపింది. ఇక పై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాని తెలిపింది. తన తోబుట్టువుల పిల్లలతో కలిసి తాను చేసిన పాటలను చూడలేకపోయానని.. అంతగా గ్లామరస్ పాటలు తనను ఇబ్బందిపెట్టాయని చెప్పుకొచ్చింది. ఇక పై అలాంటి పాటలలో నటించనని.. అప్పుడు దేనికి భయపడలేదని.. ఇప్పుడు మాత్రం చాలా బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది. తాను చనిపోయిన తర్వాత తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేయవద్దని.. అలా చేస్తే తన మరణంలోనూ బాధ కలిగిస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..

తాను గ్లామరస్ గా నటించినందుకు పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని.. తన గ్లామరస్ ఫోటోస్ సోషల్ మీడియా నుంచి తొలగించాలని.. కానీ ఆ పని తనకు సాధ్యం కావడం లేదని తెలిపింది. తన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోరింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైంది ముంతాజ్.

ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

Mumtaz News

Mumtaz News

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..