Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నలుగురితో డేటింగ్ చేశా.. ఒక్కటికూడా సెట్ కాలేదు.. ఓపెన్‌గా చెప్పిన హీరోయిన్

సాధారణంగా చాలా మంది తారలు సినీరంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అనేక కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని నటిగా ఫేమస్ అవుతారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయంకృషితో ఎదిగిన తారలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో అవమానాలు, సవాళ్లను భరించి స్టార్ స్టేటస్ అందుకుంటారు.

నలుగురితో డేటింగ్ చేశా.. ఒక్కటికూడా సెట్ కాలేదు.. ఓపెన్‌గా చెప్పిన హీరోయిన్
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 04, 2025 | 6:23 PM

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. చాలా మంది ఈ రంగుల ప్రపంచంలో తమను తాము నిరూపించుకుంటూ దూసుకుపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, ప్రేమలు, విడాకులు అనేవి చాలా కామన్ అయ్యాయి. ఇక ఎఫైర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి.కొంతమంది రెండు మూడు ఎఫైర్స్ కూడా పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ తన ఎఫైర్స్ గురించి ఓపెన్ అయ్యింది. తాను నలుగురితో ప్రేమాయణం  నడిపాను అని చెప్పింది. అయితే నలుగురితో ప్రేమాయణం నడిపినా కూడా ఒక్కరు కనెక్ట్‌ కాలేదు అని చెప్పింది. ఇంతకూ ఆమె ఎవరు.?

ఇండస్ట్రీలో  నలుగురితో ప్రేమలో పడ్డాను అని చెప్పిన హీరోయిన్ ఎవరో కాదు ముమైత్ ఖాన్. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది. ఐటమ్ సాంగ్స్ లో తన అందచందాలతో ఉర్రుతలు ఊగించింది. సినిమాలో ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్ ఉండాల్సిందే అనే రేంజ్ లో రాణించింది ఈ అమ్మడు. తెలుగులోనే కాదు తమిళ్ ,హిందీ భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది. హీరోయిన్ గాను కొన్ని సినిమాల్లో మెరిసింది ముమైత్.

అయితే ఇటీవల కాలంలో ముమైత్ ఖాన్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో సందడి చేసింది. రీసెంట్ గా ఓ డ్యాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరించింది. తర్వాత బుల్లితెర నుంచి కూడా మాయం అయ్యింది. తాజాగా ముమైత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ముమైత్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ మధ్య తనకు పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని తెలిపింది. ఆతర్వాత కోలుకున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే గతంలో నలుగురితో డేటింగ్‌ చేశానని.. వారిలో తనకు ఒక్కరు కూడా కనెక్ట్‌ కాకపోవడంతో బ్రేకప్‌ చెప్పానని తెలిపింది. ప్రస్తుతం ఒంటరిగా హాయిగా జీవితాన్ని గడుపుతున్నానని, భవిష్యత్తులో పెళ్లి రాసి ఉంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Mumtaz Khan (@mumait)

ముమైత్ ఖాన్ ..

View this post on Instagram

A post shared by Mumtaz Khan (@mumait)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి