సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టైయాన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. కె.ఇ.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా ఆడియో వేడుకల చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో..వేట్టైయాన్ మూవీ టీమ్ పాల్గొంది. ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘‘వేట్టైయాన్- ది హంటర్’ సినిమా నిర్మాణం చేసిన లైకా ప్రొడక్షన్స్ సంస్థకి, మంజు వారియర్, రానా దగ్గుబాటి సహా ఇతర నటీనటులకు, సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ ధన్యవాదాలు అన్నారు.
సాధారణంగా సినిమా హిట్ తర్వాత ఫ్లాప్ ఇస్తే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లో ఓ టెన్షన్ ఉంటుంది. నెక్ట్స్ ఎలాగైనా హిట్ మూవీ ఇవ్వాలని అనుకుంటారు. హిట్ తర్వాత హిట్ మూవీ ఇవ్వాలనే టెన్షన్ అందరికీ ఉంటుంది. సాధారణంగా హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జరగాలి. అన్నీ అలా కుదరాలి. జైలర్ మూవీ హిట్ తర్వాత నేను కథలు విని, కొన్నాళ్లకు కథలు పెద్దగా వినటం మానేశాను. ఆ సమయంలో సౌందర్య, డైరెక్టర్ జ్ఞానవేల్‌ను కలిసింది. అప్పటికే నేను జై భీమ్ సినిమాను చూసి ఉన్నాను. సాధారణంగా మంచి సినిమాలను చూసినప్పుడు సదరు దర్శకులకు ఫోన్ చేసి మాట్లాడటం నాకు అలవాటు. కానీ ఎందుకనో జ్ఞానవేల్‌తో నేను మాట్లాడలేదు. ఆ సమయంలో సౌందర్య నా దగ్గరకు వచ్చి జ్ఞానవేల్ దగ్గర మంచి లైన్ ఉందని, వినమని నాతో చెప్పింది. మీరు సందేశాత్మక సినిమాలు తీస్తుంటారు. కానీ నాతో కమర్షియల్ సినిమాలు తీయాలి. మీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు అని చెప్పాను. తర్వాత తను చెప్పిన కథ విన్న తర్వాత నాకు నచ్చింది అని అన్నానని సూపర్ స్టార్ చెప్పారు.
ఆతర్వాత మంజు వారియర్ మాట్లాడుతూ తమిళంలో నేను అసురన్, తునివు అనే సినిమాలు మాత్రమే చేశాను. కానీ నాకు దొరికిన ఆదరణ చూస్తుంటే మాటలు రావటం లేదు. ఇప్పుడు వేట్టైయాన్ మూడో సినిమా. జై భీమ్ సినిమా చూసిన తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్నాను. కానీ ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు. రజినీగారు, అమితాబ్‌గారు, లైకా ప్రొడక్షన్స్, ఫహాద్, రానా.. ఇలాంటి యాక్టర్స్‌తో కలిసి వర్క్ చేయటాన్ని ఎంజాయ్ చేశాను. సూపర్‌స్టార్‌గారి గురించి చెప్పాలంటే 50 ఏళ్ల ఆయన ప్రయాణం అసాధారణం. ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్‌లో ఆయనెంతో ఇన్‌స్పిరేషన్. ఆయనతో వర్క్ చేయటం డ్రీమ్ కమ్ ట్రు అనిపించింది. సపోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు థాంక్స్ అని చెప్పుకొచ్చింది మంజు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.