అసభ్యకరంగా తాకిన అభిమానులు.. హీరోయిన్ చేసిన పనికి అందరూ షాక్

చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనూ బిజీగా గడుపుతారు. అయితే జనాల్లోకి వెళ్లిన సమయంలో చాలా మంది హీరోయిన్స్ కు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తమ అభిమాన హీరోయిన్ ను చూసేందుకు, లేదా ఫోటోలు తీసేందుకు ఫ్యాన్స్ ఎగబడతారు. తాజాగా ఓ హీరోయిన్ కు అలాంటి ఘటనే ఎదురైంది.

అసభ్యకరంగా తాకిన అభిమానులు.. హీరోయిన్ చేసిన పనికి అందరూ షాక్
Actress

Updated on: May 02, 2025 | 6:52 PM

సినీ సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో, హీరోయిన్స్ బయట కనిపిస్తే చాలు అభిమానులు ఎగబడిపోతారు. సినిమా ఫ్యాక్షన్స్ లేదా.. ఏదైనా షాపింగ్ మాల్ ఓపినింగ్స్ ఓపినింగ్స్ సమయంలో హీరో హీరోయిన్స్ చూడటానికి అభిమానులు ఆసక్తి చూపిస్తారు. దాంతో తమ అభిమాన నటీ నటులను చూడాలని , ఫోటోలు దిగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొంతమంది అభిమానులు అత్యుత్సహం చూపిస్తూ ఉంటారు. హీరోయిన్స్ ను తాకాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమలోనే కొంతమంది అసభ్యకరంగా తాకుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఓ స్టార్ హీరోయిన్ కు ఎదురైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మలయాళ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్.

తాజాగా మంజు వారియర్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. మంజు వారియర్ ఓ షాపింగ్ మాల్ ఓపినింగ్ కు వెళ్ళింది. అక్కడకు ఆమెను చూడటానికి చాలా మంది అభిమానులు వచ్చారు. షాపింగ్ మాల్ ఓపినింగ్ తర్వాత మంజు తిరిగి వెళ్లే సమయంలో ఆమె కారు ఎక్కే క్రమంలో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఒక్క ఫోటో అంటూ ఆమె పై ఎగబడ్డారు. అభిమానులకు ఆమె అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమె నడుమును తాకినట్టు కనిపించింది. అయితే అది అమ్మాయా.? లేక అబ్బాయా అన్నది వీడియోలో తెలియలేదు.

మంజు వారియర్ మాత్రం అభిమానులకు నవ్వుతూనే అభివాదం చేసింది. ఆతర్వాత సెల్ఫీ కూడా దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మంజు వారియర్ నటిగా నిర్మాతగా రాణిస్తుంది. ఇటీవలే ఆమె నటించిన వేటయన్, విడుదల 2 సినిమాలు మంచి విజయాలను అనుకున్నాయి. రీసెంట్ గా ఎల్2 ఎంపురాన్ సినిమాలో నటించింది. సోషల్ మీడియాలోనూ మంజు చాలా యాక్టివ్ గా ఉంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.