- Telugu News Photo Gallery Cinema photos Sree Vishnu Apology To Kannappa Team for using dialogue in single movie
Sree Vishnu: సింగిల్ మూవీ లో కన్నప్ప డైలాగ్.. టాలీవుడ్‌లో రేగిన సెగ
చిన్న సినిమా ట్రైలర్‌లో ఉన్న మాటలు టాలీవుడ్‌లో పెద్ద దుమారానికి దారి తీశాయి. శ్రీవిష్ణు నటించిన సింగిల్ సినిమా ట్రైలర్‌లో ఉన్న పేరడీలు, డైలాగులు.. మంచు విష్ణు కన్నప్ప టీమ్‌ని ఎక్కడ హర్ట్ చేశాయి? ఆ తర్వాత జరిగిందేంటి? మాట్లాడుకుందాం పదండి... సింగిల్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచీ మంచు విష్ణు, శ్రీ విష్ణు మధ్య వివాదం మొదలైంది.
Updated on: May 02, 2025 | 6:30 PM

సింగిల్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచీ మంచు విష్ణు, శ్రీ విష్ణు మధ్య వివాదం మొదలైంది. ట్రైలర్‌లో శివయ్యా అనే డైలాగ్ .. తమ కన్నప్పలోని శివయ్యా.. అనే డైలాగ్‌కి పేరడీలా ఉందని హర్టయ్యారట మంచు విష్ణు.

ట్రైలర్‌లో మంచు కురిసిపోతుందనే.. డైలాగ్ విని ఫైర్ అయ్యారట మంచు మోహన్‌బాబు. అసలు అలాంటి మాటలు ఎలా వాడుతావంటూ శ్రీవిష్ణుకి ఫోన్ చేసి చెడామడా తన స్టైల్‌లో తిట్టేశారట. తనకు చెడు ఉద్దేశం లేదని శ్రీవిష్ణు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదట మంచు సీనియర్.

సినిమాటిక్ లిబర్టీతోనే ఇలా చేశానని, అసలు ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని శ్రీవిష్ణు చేసిన వీడియో వైరల్ అవుతోందిప్పుడు. శ్రీవిష్ణు సారీ చెప్పినా ఆగలేదు వివాదం.. ఫిల్మ్ చాంబర్‌లో కంప్లైంట్ వరకు వెళ్లింది.

చాంబర్‌లో చర్చలకు సింగిల్ మూవీ తరఫున శ్రీవిష్ణు, బన్నీవాసు వెళ్లారు. అయితే బన్నీవాసు కారు దగ్గరే ఆగిపోయినట్టు సమాచారం. మంచు విష్ణుకు బదులుగా మోహన్‌బాబు చర్చలకు హాజరయ్యారట. లోపలేం జరిగిందోగానీ, మోహన్‌బాబు కోపంగా బయటకు వెళ్లారనే వార్తలు మాత్రం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదంతా జరిగిన కాసేపటికి బన్నీవాసు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ ప్రత్యక్షమైంది. ''ఓ విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది.. అలాగే గొడవలు ఎందుకు అని కూడా ఉంది.. శాంతి శాంతి శాంతి..'' అంటూ పోస్ట్ వేశారు బన్నీ వాసు. అప్పటి నుంచి ఈ విషయం టాలీవుడ్‌లో మరింత చర్చనీయాంశంగా మారింది.

చిన్న సినిమా ట్రైలర్ విషయంలో ఈ దుమారం ఏంటని చర్చించుకుంటున్నారు. తమను గీతా ఆర్ట్స్ కావాలనే ట్రోల్ చేస్తోందని ఇంకా రగిలిపోతోందట మంచు కాంపౌండ్. చిన్న సినిమా రిలీజ్ టైమ్‌లో ఈ ఈగో గొడవలేంటని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు.




