AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు.. బర్త్ డేకి బంగారం, డైమండ్స్ ఉన్న రింగ్ గిఫ్ట్ ఇచ్చారు.. టాలీవుడ్ నటి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో ఈమె కూడా ఒకరని చెప్పవచ్చు. స్టార్ హీరో నటుడి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారీ అందాల తార. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా, యాంకర్ గానూ సత్తా చాటారు.

లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు.. బర్త్ డేకి బంగారం, డైమండ్స్ ఉన్న రింగ్ గిఫ్ట్ ఇచ్చారు.. టాలీవుడ్ నటి
Lakshmi Parvathi
Basha Shek
|

Updated on: Apr 28, 2026 | 1:42 PM

Share

కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మంచు లక్ష్మి. ఆ తర్వాత తన మల్టీ ట్యాలెంట్ తో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా, యాంకర్ గానూ సత్తా చాటారు. మొన్నటివరకు వెండితెరతో పాటు బుల్లితెరపైనా బిజీ బిజీగా గడిపిన మంచు వారమ్మాయి ఇప్పుడు ముంబైకు షిఫ్ట్ అయ్యారు. తెలుగు సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మి ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. మోహన్ బాబు సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే మోహన్ బాబు నిర్మాణంలోనూ సినిమాలు చేశారు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే మంచు వారి పిల్లలు ఎన్టీఆర్ కు బాగా దగ్గరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘ చిన్నప్పుడు నేను రెగ్యులర్ గా ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లేదాన్ని. ఆయనను అంకుల్ అని పిలుస్తా. చాలా క్లోజ్ ఆయనకు. మా ఇంటికి వెళ్లినట్టే వాళ్లింటికి వెళ్లేదాన్ని. సీఎం అయ్యాక కూడా తరచూ ఆయన ఇంటికి వెళ్లేదాన్ని. నేను వెళ్లినప్పుడల్లా పెద్ద గ్లాస్ నిండా పాలు ఇచ్చేవాళ్లు. కానీ అవి తాగడానికి కష్టపడేదాన్ని. లక్ష్మి పార్వతి గారు కూడా నన్ను చిన్న పిల్లలా బాగా చూసుకునేవారు. రాత్రి పూట డిన్నర్ టైంకి వెళ్తే ఆవిడే అన్నం కలిపి ఎన్టీఆర్ గారికి, నాకు తినిపించేవారు. ఒకసారి నా పుట్టిన రోజుకు బంగారం, డైమండ్స్ ఉన్న రింగ్ గిఫ్ట్ ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి నాకు గిఫ్ట్ ఇచ్చారని అందరూ కుళ్లుకున్నారు. ఒకసారి నేను ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు తరగతిలో మీకు పొలిటికల్ లీడర్స్ ఎవరైనా తెలుసా అంటే నేను ఎన్టీఆర్ గారు తెలుసు అని చెప్పాను. దీంతో అందరూ షాక్ అయ్యారు. నేను మా క్లాస్ మేట్స్ అందరిని దాదాపు ఒక 50 మందిని ఎన్టీఆర్ ఇంటికి తీసుకెళ్లి అందరికీ ఆటోగ్రాఫ్స్ ఇప్పించాను. ఆయన అందరికి ఫుడ్ పెట్టించారు. ఆయనతో నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి’ అని అన్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మంచు లక్ష్మీ డ్యాన్స్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us