యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు డార్లింగ్ నటిస్తోన్న చిత్రాల నుంచి స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రభాస్ అభిమానులకు ఖుషి చేస్తున్న చిత్రనిర్మాతలు. ఇప్పటికే ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాల నుంచి అప్డేట్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే తమ అభిమాన హీరోకు అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ డార్లింగ్‌కు బర్త్ డే విషెస్ తెలిపింది. అయితే ఆమె చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతుంది. దీంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు పుట్టినరోజు తెలుపుతున్నారు సెలబ్రెటిలు. దుల్కర్ సల్మాన్.. ప్రశాంత్ నీల్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విష్ చేయగా.. తాజాగా టాలీవుడ్ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ తన ట్విట్టర్ వేదికగా డార్లింగ్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. “హ్యాపీ బర్త్ డే టూ వన్ ఆఫ్ మై ఫేవరేట్.. మీరు మరింత ఎత్తుకు ఎదగాలి ” అంటూ రాసుకొచ్చింది. మాళవిక చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. దీంతో మీ కాంబో చూసేందుకు మేము వెయిటింగ్.. ప్రభాస్.. మారుతి హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్‌లలో బిజీగా ఉన్న ప్రభాస్.. ఆ తర్వాత డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఇందులో డార్లింగ్ సరసన నిధఇ అగర్వాల్, మాళవిక మోహనన్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా పట్టాలెక్కనుంది.
Happy Birthday to one of my favourites! ☺️ May you soar higher & higher! ?#HappyBirthdayPrabhas pic.twitter.com/OwQMdqiQh7
— malavika mohanan (@MalavikaM_) October 23, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.