Madhavilatha : మీరేదో సతి సావిత్రి.. మహా పురుషులు మరి.. సమంత రెండో పెళ్లి పై టాలీవుడ్ హీరోయిన్..

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరును డిసెంబర్ 1న కోయంబత్తూరులోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే సమంత రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా సామ్ పెళ్లిపై టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Madhavilatha : మీరేదో సతి సావిత్రి.. మహా పురుషులు మరి.. సమంత రెండో పెళ్లి పై టాలీవుడ్ హీరోయిన్..
Madhavilatha

Updated on: Dec 10, 2025 | 4:48 PM

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న సామ్.. డిసెంబర్ 1న బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయంలో వీరి వివాహ వేడుక జరిగింది. అయితే సామ్, రాజ్ నిడుమోరు దంపతులకు పలువురు విషెస్ చెప్పగా.. మరికొందరు తీవ్ర విమర్శలు చేశారు. అలాగే సామ్ పెళ్లి పలువురు హీరోయిన్స్ సైతం పరోక్షంగా రియాక్ట్ అవుతూ విమర్శలు చేశారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత సామ్ పెళ్లి, ట్రోలింగ్ పై తనదైన స్టైల్లో స్పందించారు. సమంత పెళ్లి చేసుకుంటే ఎవరెవరో ఏడుస్తున్నారని.. వీళ్లకేంటో బాధ అంటూ వీడియో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..

ఇవి కూడా చదవండి

ఆ వీడియోలో మాధవీలత మాట్లాడుతూ.. “సమంత పెళ్లి చేసుకుంటే ఎవరెవరో ఏడుస్తున్నారు. వీళ్లకెంటో బాధ. ఆమె ఎవరిదో సంసారం కూల్చింది ? అన్నట్లు కామంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ చేస్తున్న మీరే ముందుగా ఎన్ని రిలేషన్ షిప్ లో ఉన్నారో అనే విషయాన్ని ప్రశ్నించుకోండి. మరొకరు పెళ్లి చెడగొట్టి పెళ్లి చేసుకున్నవాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొకటి సంసారాన్ని కూల్చి పెళ్లి చేసుకున్నారు కదా.. అంటే అక్కడ మీరు తెలివిగా తప్పించుకున్నారా.. ? అయితే కొందరు విడాకులు ఇవ్వకుండా వేరేవారిని పెళ్లి చేసుకోకుండా వ్యవహారం నడిపిస్తున్నారా.. ? పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఎవరికి ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పటివరకు కలిసి ఉంటారు. రుణాలు తీరిపోతే విడిపోతారు. ఒకరినొకరైతే చంపుకోవడం లేదు కదా.. ఆ విషయంలో సంతోషించండి” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

ప్రస్తుతం మాధవీలత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. “మీరేమో పత్తిత్తులు కాదు కదా.. ఇలా కామెంట్స్ చేసేవారి గురించి నాకు బాగా తెలుసు ” అంటూ కౌంటర్ ఇచ్చారు. అలాగే “ఏడ్చే సమాజం ఎలాగూ ఏడుస్తది. పెళ్లి చేసుకుంటే విష్ చేసే రోజులు పోయి పడి ఏడ్చే రోజులు వచ్చాయి. మీరు ఎదో సతి సావిత్రి. మహా పురుషులు రాముడు అయినట్లు. వేషాలు దొబ్బకండి” అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..