Devara: దేవర స్పెషల్ షో చూసిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ.. ఎన్టీఆర్ గురించి ఏమన్నారో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈనెల 27న విడుదలైన దేవర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈనెల 27న విడుదలైన దేవర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే దేవర 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక సినిమాలో ఎన్టీఆర్ నటన అదిరిపోయిందంటూ ప్రశంసలు వస్తున్నాయి. అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం దేవర సినిమాను చూసి తారక్ ను మెచ్చుకుంటున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ దేవర సినిమా చూసింది. అనంతరం సినిమా గురించి తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘ఇతనే నా హీరో, సెమ్మ మాస్.. దీన్ని ఎలా మిస్ చేయగలను, దేవరతో అతను ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం చూస్తున్నాను’ అని ట్వీట్ చేసింది ఖుష్బూ. దీనికి దేవర స్టోర్మ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేసింది. ఖుష్బూ చేసిన ట్వీట్ కు ఏకంగా 26,000కు పైగా లైక్స్ రావడం విశేషం.
ఖుష్బూ చేసిన ట్వీట్ తారక్ కూడా వెంటనే స్పందించాడు. ‘హాహా.. థాంక్యూ మేడమ్, దేవర మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను నందమూరి అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. కాగా గతంలో కూడా కుష్భూ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ‘తారక్ అంటే నాకు చాలా ఇష్టం, అతని నటన ఓ అద్భుతం’ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. తారక్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. గతంలో వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
నటి ఖుష్బూ ట్వీట్..
And this is my hero!! Semma mass.. @tarak9999 ❤️❤️❤️❤️❤️❤️ how can I miss this?? Watched him marvel and take the world by storm as #Devara in london. #DevaraStorm pic.twitter.com/CtPOk0lu8w
— KhushbuSundar (@khushsundar) September 28, 2024
దేవర సినిమా మరో అరుదైన ఘనత..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.