Kushboo: ‘ఆ హీరోతో టబు నటించడం చూసి అసూయ కలిగింది’.. ఖుష్బూ ఆసక్తకిర వ్యాఖ్యలు..

|

Apr 19, 2023 | 7:07 AM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా కొనసాగిన ఖుష్బూ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లో సహయనటిగా మెప్పిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రామబాణం సినిమాలో ఆమె కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ వచ్చే నెల 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Kushboo: ఆ హీరోతో టబు నటించడం చూసి అసూయ కలిగింది.. ఖుష్బూ ఆసక్తకిర వ్యాఖ్యలు..
Kushboo
Follow us on

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఖుష్బూ ఒకరు. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అత్యంత ఎక్కువ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ ఆమెనే. అప్పట్లోనే ఆమెకు తమిళనాడులో గుడి కట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె అందానికి ఎంతగా ఆరాధించేవారో. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా కొనసాగిన ఖుష్బూ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లో సహయనటిగా మెప్పిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రామబాణం సినిమాలో ఆమె కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ వచ్చే నెల 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఖుష్బూ  ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తెలుగు సినిమాతోనే తన సినీ ప్రయాణం మొదలైందని అన్నారు. వెంకటేష్ సూచనతోనే ఆయన తొలి చిత్రం కలియుగ పాండవుల కోసం తనను ఎంపిక చేశారని తెలిపారు. “ఓ హిందీ సినిమా చూసి నన్ను సెలక్ట్ చేయమని వెంకీ చెప్పారట. అది నా అదృష్టం. కె. రాఘవేంద్రరావు, జంధ్యాల, భారతిరాజా, బాలచందర్… ఇలా గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశం కలిగింది. నేను మద్రాసులో ఉన్న సమయంలో తెలుగు నుంచి ఎక్కువగానే అవకాశాలు వచ్చినా చేయలేకపోయాను. అలా చంటి సినిమాను కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది.

నేను చిరంజీవి, బాలకృష్ణలకు జోడిగా నటించలేదు. అవకాశం వస్తే వాళ్లతో కలిసి నటించాలని ఉంది. అమితాబ్ బచ్చన్ తోనూ కలిసి నటించాలని ఉండేది. బాలనటిగా ఆయనతో కలిసి నటించాను. నా అభిమాన నటుడు ఆయన ఫోటోస్ ఇప్పటికీ నా బెడ్ రూమ్ లో ఉంటాయి. చీనీకమ్ చిత్రంలో ఆయనతో కలిసి టబు నటించడాన్ని చూసి చాలా అసూయగా అనిపించింది. ఇదే విషయాన్ని టబుకు ఫోన్ చేసి నా అసూయనంత వెళ్లగక్కాను ” అంటూ చెప్పుకొచ్చారు ఖుష్బూ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.