
సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన దోచేయ్ సినిమాలో నటించింది. ఈ సినిమాకూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. దాంతో ఈ అమ్మడు తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ టాప్ బ్యూటీగా మారిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో ఆదిపురుష్ సినిమా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో కృతిసనన్ సీతగా నటిస్తోంది.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది. కాగా ఈ సినిమా తర్వాత కృతిసనన్ కు తెలుగులో తిరిగి అవకాశాలు వస్తాయని భావిస్తోంది. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో టాలీవుడ్ వైపే చూస్తున్నాయి. దాంతో మనదగ్గర నటించాడానికి చాలా మంది హీరోయిన్స్ ఉత్సహంగా ఉన్నారు. అలాగే కృతి కూడా..
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియో కుర్రకారును కవ్విస్తున్నాయి. అందాలు ఆరబోస్తూ కృతి సనన్ ఇచ్చిన ఫోజులు యువత మతిపోగొడుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజనులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.