Actress : వరుసగా సినిమాలన్నీ ప్లాప్.. రూ.84 కోట్ల లగ్జరీ ఇళ్లు కొన్న హీరోయిన్.. రేంజ్ మాములుగా లేదుగా..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలోనే వరుసగా పెద్ద పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సముద్రానికి ఎదురుగా డ్యూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

Actress : వరుసగా సినిమాలన్నీ ప్లాప్.. రూ.84 కోట్ల లగ్జరీ ఇళ్లు కొన్న హీరోయిన్.. రేంజ్ మాములుగా లేదుగా..
Kriti Sanon

Updated on: Aug 15, 2025 | 5:07 PM

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర హీరోయిన్లలో ఆమె ఒకరు. తక్కువ సమయంలోనే హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇటీవలే లగ్జగీ పెంట్ హౌస్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ కృతి సనన్. మిమి సినిమాకుగానూ ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డ్ అందుకుంది. ఈ ఒక్క సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. దీంతో హిందీ సినిమా ప్రపంచంలోని స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరిగా నిలిచింది. తాజాగా ఈ అమ్మడు ముంబైలోని నాగరిక పాలి హిల్ ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఉన్న డ్యూప్లెక్స్ పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

నివేదికల ప్రకారం కృతి సనన్ కొనుగోలు చేసిన రెసిడెన్షియల్ టవర్‌లోని ఈ లగ్జరీ పెంట్‌హౌస్‌ను రూ. 78.20 కోట్లు అని తెలుస్తోంది. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం కృతి కొత్త ఇల్లు 14వ , 15వ అంతస్తులలో విస్తరించి ఉంది. ఇది 6,636 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంది. పై అంతస్తుతో పాటు 1,209 చదరపు అడుగుల టెర్రస్ కూడా ఉంటుంది. చదరపు అడుగు ధర దాదాపు రూ. 1.18 లక్షలు. ఈ ఒప్పందంలో 6 కార్ పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయి. ఈ డీల్ కోసం కృతి సనన్ రూ.3.91 కోట్ల స్టాంప్ డ్యూటీ, GST, ఇతర ఛార్జీలతో సహా మొత్తం రూ.84.16 కోట్లకు పైగా చెల్లించింది.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

అరేబియా సముద్రానికి దగ్గరగా కృతి కొనుగోలు చేసిన ఇల్లు ఉన్నట్లు సమాచారం. కృతి సనన్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2023లో అలీబాగ్‌లో 2,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేసింది. అమితాబ్ బచ్చన్ కూడా ఇక్కడ ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. మీడియా నివేదికల ప్రకారం కృతి 2024లో బాంద్రా వెస్ట్‌లో 4-BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది, దీని విలువ రూ. 35 కోట్లు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కృతి సనన్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ధనుష్ తో కలిసి ‘తేరే ఇష్క్ మే’ సినిమాలో కనిపించనుంది.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..