Keerthy Suresh: రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తోన్న క్యూట్ బ్యూటీ.. లేటెస్ట్ పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ లో కీర్తిసురేష్ ఒకరు. నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కీర్తి సురేష్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

Keerthy Suresh: రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తోన్న క్యూట్ బ్యూటీ.. లేటెస్ట్ పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..
Keerthy Suresh
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 06, 2022 | 11:06 AM

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ లో కీర్తిసురేష్(Keerthy Suresh)ఒకరు. నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కీర్తి సురేష్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తక్కువ సమయంలో ఈ రేంజ్ లో క్రేజ్ సొంతం చేస్కోవడం అంటే మాములు విషయం కాదు. ఇక ఈ అమ్మడు నటించిన మహానటి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది ఈ చిన్నది. ఇక స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు అందుకుంటోంది ఈ భామ. రీసెంట్ గా మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటించింది కీర్తిసురేష్. అయితే నిన్నమొన్నటిదాకా పద్దతిగా కనిపించిన కీర్తిసురేష్ ఈ మధ్య కాలంలో కాస్త గ్లామర్ డోస్ పెంచింది.

సర్కారు వారి పాట సినిమాలో కాస్త గ్లామరస్ గా కనిపించి కవ్వించింది.  దాంతో కుర్రాళ్ళ మతిపోయినంత పనైంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టైలిష్ ఫొటోలతో కుర్రక్కరుకి కిర్రెక్కిస్తోంది. స్కిన్ షోతో షివరింగ్ తెప్పిస్తోంది కీర్తిసురేష్. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కీర్తి అందాన్ని పొగడకుండా ఉండలేక పోతున్నారు. ప్రస్తుతం కీర్తిసురేష్ నాని నటిస్తున్న దసరా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ సినిమాలో చేస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుంది కీర్తి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి