Maha Kumbh Mela: మహా కుంభమేళాలో స్టార్ హీరోయిన్ స్నానం.. సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు.. వీడియో వైరల్

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ముగింపునుకు వచ్చింది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా వేడుక బుధవారం (ఫిబ్రవరి 26)తో ముగియనుంది. దీనికి తోడు మహా శివరాత్రి కావడంతో మహా కుంభమేళాకు భక్తుల పోటెత్తుతున్నారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో స్టార్ హీరోయిన్ స్నానం.. సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు..   వీడియో వైరల్
Maha Kumbh Mela

Updated on: Feb 26, 2025 | 3:42 PM

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా బుధవారం (ఫిబ్రవరి 26)తో ముగియనుంది. జనవరి 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఇప్పటివరకు కోట్లాది మంది భక్తులు స్నానమాచరించారు.ఇందులో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా సినీ తారలు పెద్ద ఎత్తున మహా కుంభమేళాను దర్శించుకున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రెండు రోజుల క్రితం మహా కుంభమేళాకు వచ్చిన సంగతి తెలిసిందే. తన అత్తమ్మ , హీరో విక్కీ కౌశల్ తల్లి వీనా కౌశల్ తో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. అయితే కత్రినా కుటుంబీకులు స్నానం ఆచరిస్తుండగానే కొందరు అభిమానులు ఆమెను చుట్టు ముట్టారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు భారీగా చుట్టు ముట్టారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మండి పడుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో సెలబ్రిటీల కోసం అభిమానులు ఇలా ఎగబడడం అసలు బాగోలేదంటున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో కూడా వీఐపీ కల్చర్ ఎందుకంటూ సూచిస్తున్నారు. అయితే ఇందులో కత్రినా తప్పేమిలేదంటున్నారు ఆమె అభిమానులు. కొందరు జనాలే అత్యుత్సాహంతో కత్రినాతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారని విమర్శలు కురిపిస్తున్నారు.

కాగా మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంది. గంగా హారతి కార్యక్రమానికి కూడా హాజరైంది. అలాగే స్వయంగా భక్తులకు అన్నప్రసాదం కూడా వడ్డించింది. ఇక అంతకు ముందు పరమార్థ నికేతన్ ఆశ్రమం వ్యవస్థాపకులు స్వామి చిదానంద సరస్వతి ఆశీస్సులు తీసుకుంది. అలాగే అక్కడ జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంది.

ఇవి కూడా చదవండి

మహా కుంభమేళాలో కత్రినా చుట్టూ గుంపు గూడిన అభిమానులు..

త్రివేణి సంగమం వద్ద స్నానమాచరిస్తోన్న కత్రినా కైఫ్..

మహా కుంభమేళాలో కత్రినా, రవీనా.. వీడియో

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.