Kasturi Shankar: ‘కుక్కలు కూడా ఇలాంటి పనులు చేయవు’.. గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటనపై కస్తూరి ఆగ్రహం

సీరియల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది నటి కస్తూరి. సమాజంలో జరిగే సంఘటనలు, మహిళల సమస్యల వంటి సామాజిక అంశాలపై తన దైన శైలిలో గళం విప్పుతోంది. ఈక్రమంలో ఓ ఎమ్మెల్యే బంధువు చేసిన అమానవీయ పనిపై ఫైర్‌ అయ్యింది కస్తూరి.

Kasturi Shankar: 'కుక్కలు కూడా ఇలాంటి పనులు చేయవు'.. గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటనపై కస్తూరి ఆగ్రహం
Kasturi Shankar
Follow us
Basha Shek

|

Updated on: Jul 05, 2023 | 5:53 PM

‘అన్నమయ్య’ సినిమాలో నాగార్జున మరదలిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది కస్తూరి శంకర్‌. ఈ సినిమాతో పాటు బాలయ్య నిప్పురవ్వ, మోహన్‌బాబు సోగ్గాడి పెళ్లాం,రాజశేఖర్ మా ఆయన బంగారం, రథయాత్ర తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఒకప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై హీరోయిన్‌గా వెలుగొందిన తార ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. గృహలక్ష్మి వంటి పలు హిట్‌ సీరియల్స్‌లో నటిస్తోందామె. సీరియల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది నటి కస్తూరి. సమాజంలో జరిగే సంఘటనలు, మహిళల సమస్యల వంటి సామాజిక అంశాలపై తన దైన శైలిలో గళం విప్పుతోంది. ఈక్రమంలో ఓ ఎమ్మెల్యే బంధువు చేసిన అమానవీయ పనిపై ఫైర్‌ అయ్యింది కస్తూరి. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లో పర్వేష్‌ శుక్లా అనే వ్యక్తి మద్యం మత్తులో ఊగుతూ, సిగరెట్‌ తాగుతూ మరో యువకుడిపై మూత్రం పోశాడు. సదరు యువకుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పుడీ ఘటనపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కస్తూరి. సోషల్‌ మీడియా వేదికగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఆమె..

‘కుక్కలు కూడా ఇలాంటి పనులు చేయవు. ప్రవేష్‌ శుక్లా బీజేపీ ఎమ్మెల్యే కేదార్‌ నాథ్‌ శుక్లాకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. నిర్ణయాత్మకంగా తక్షణమే ఆ నీచుడిని శిక్షిస్తారా? లేదా విషయాన్ని వదిలేస్తారా? గతంలో ఎయిర్‌ ఇండియా విమానంలో తమిళనాడు బీజేపీ నేత చేసిన ఘటన గుర్తుకొచ్చి అడుగతున్నా’ అంటూ ట్వీట్‌ చేసింది కస్తూరి.

ఇవి కూడా చదవండి

మరోవైపు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ఈ అమానవీయ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో పోలీసులు ప్రవేష్‌ శుక్లాను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు. కస్తూరి ట్వీట్‌ చేసిన కొద్ది సేపటికే ఇదంతా జరిగింది. దీంతో శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ట్వీట్‌ను రిట్వీట్‌ చేసిన ఆమె ‘వావ్ క్విక్ రియాక్షన్. ఈ విషయం గురించి ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుసుకున్నారు’ అని రాసుకొచ్చింది. అలాగే నిందితుడిని PCA, IPC 290, IPC 352 మరిన్ని సెక్షన్ల కింద శిక్షించవచ్చని తెలిపింది. ఎమ్మెల్యే కేదార్‌ నాథ్‌ కూడా సదరు నిందితుడితో ఎలాంటి సంబంధం లేదని ఈ ఘటనను ఖండించారని ట్వి్ట్టర్లో పొందుపరిచింది కస్తూరి.

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.