నటి కస్తూరి వివాదం రోజుకొక మలుపు తిరుగుతుంది. తెలుగు వారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంది. ఆమె పై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఆమె పై పోలీసు కేసు కూడా నమోదు చేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ను ఆశ్రయించారు. కాగా ముందస్తు బెయిల్ కోసం నటి కస్తూరి పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కస్తూరి పై పలు తెలుగు సంఘాలు పిర్యాదు చేశాయి. కాగా వారం క్రితం సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది , అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. దాంతో కస్తూరి అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ లో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు కస్తూరి. మంగళవారం కస్తూరి పిటిషన్ ను విచారించిన మదురై బెంచ్ కస్తూరి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు, తమిళులను వేరు చేసి ఎలా మాట్లాడతారని కోర్టు సీరియస్ అయ్యింది. దాంతో కస్తూరి కి ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ.. న్యాయస్థానం పిటిషన్ కొట్టివేసింది.
ఇటీవల చెన్నైలో బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి శంకర్ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు. దాంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. తమిళనాడులో రాజకీయంగా చక్రం తిప్పుతున్న కొందరు అంటూ వారిని ఉద్దేశించి ఎప్పుడో దశాబ్దాల క్రితం రాణుల దగ్గర సేవలు చేయడానికి వచ్చి ఇక్కడ స్థిరపడి తమిళనాడు చలామణి అవుతూ.. మాట్లాడుతున్నారని తెలుగువారిని ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారం రేపాయి.
తమిళనాడులో ఉన్న తెలుగు వారు అంతఃపురంలో ఊడిగం చేసుకోవడానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారా తెలుగువారు అంటే ఎంత చిన్నచూపు ఎందుకు అంటూ తెలుగు సంఘాలు నటి కస్తూరి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పోలీసులు కూడా కస్తూరి వ్యాఖ్యల విషయాన్ని సీరియస్ గా తీసుకొని కేసులు నమోదు చేశారు. ఇక నటి కస్తూరి అరెస్టు తప్పదు అని తెలిశాక ఆమె తమిళనాడు నుంచి వెళ్లిపోయారు. విచారణకు రావాలని సమన్లు అందజేసేందుకు పోలీసులు కస్తూరి ఇంటికి వెళ్ళగా అక్కడ ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచాఫ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నటి కస్తూరి పోలీసులు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు గుర్తించారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ను ఆశ్రయించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.