Actress Karthika: పెళ్లికి సిద్ధమైన ‘రంగం’ హీరోయిన్.. ఎంగేజ్మెంట్ ఫోటోస్ వైరల్.. వరుడు ఎవరంటే..

కార్తీక సైతం సినీ నటిగా అరంగేట్రం చేసింది. అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ కార్తీక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దమ్ము సినిమాలో మెరిసింది. కానీ అనుకున్నంతగా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలో రాణిస్తుంది. తాజాగా హీరోయిన్ కార్తీక పెళ్లికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

Actress Karthika: పెళ్లికి సిద్ధమైన 'రంగం' హీరోయిన్.. ఎంగేజ్మెంట్ ఫోటోస్ వైరల్.. వరుడు ఎవరంటే..
Karthika
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 21, 2023 | 6:43 AM

80వ దశకంలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రాధ. దక్షిణాది సినీ పరిశ్రమలో నటిగా గుర్తింపు తెచ్చుకుంది రాధ. ఆ తర్వాత ఆమె పెద్ద కూతురు కార్తీక సైతం సినీ నటిగా అరంగేట్రం చేసింది. అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ కార్తీక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దమ్ము సినిమాలో మెరిసింది. కానీ అనుకున్నంతగా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలో రాణిస్తుంది. తాజాగా హీరోయిన్ కార్తీక పెళ్లికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంలో కార్తీక తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

హీరోయిన్ కార్తీక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. తాజాగా తన ఇన్ స్టాలో ఓ వ్యక్తిని హాగ్ చేసుకుంటూ ఉంగరం ధరించిన ఫోటోను షేర్ చేసింది. ఇక ఆ ఫోటో చూస్తే ఆమెకు నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. అయితే కార్తీక పెళ్లిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అలాగే, కార్తీక తన పోస్ట్‌లో తన కాబోయే భర్త గురించి సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ ఆ ఫోటోలో కేవలం ఉంగరాన్ని మాత్రమే హైలెట్ చేస్తూ కనిపించడం.. నెగిటివ్ ఎనర్జీ పడకూడదనే ఈగల్ ఐ ఎమోజీని షేర్ చేయడంతో కార్తీక ఎంగేజ్మెంట్ అయినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కార్తీకకు కాబోయే వరుడు ఎవరనేది మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా కార్తీక ప్రేమ, పెళ్లి గురించి వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అయితే ఆ రూమర్స్ పై కార్తీక నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఇప్పుడు ఆమె ఇన్ స్టా పోస్ట్ చూసి ఆ రూమర్స్ నిజమే అంటున్నారు.

కార్తీక సోదరి తులసి కూడా కొన్ని సినిమాల్లో నటించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘కడల్’ సినిమాతో ఆమె తొలిసారిగా నటించింది. ఈ చిత్రంలో గౌతమ్ కార్తీక్ నటించారు. అలాగే తెలుగులో అల్లరి నరేష్ నటించిన బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. ఈ సందర్భంలో కార్తీక ఎలాంటి సందడి లేకుండా షేర్ చేసిన పోస్ట్ మాత్రం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే