Kamna Jethmalani: కెరీర్ టాప్‏లో ఉన్నప్పుడే పెళ్లి జరిగింది… ఇప్పటికీ ఒక కోరిక మిగిలిందంటున్న హీరోయిన్..

టాలెంటెడ్ హీరో గోపిచంద్ సరసన రణం వంటి సూపర్ హిట్ సినిమాతో గుర్తింపు పొందింది హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూనే..

Kamna Jethmalani: కెరీర్ టాప్‏లో ఉన్నప్పుడే పెళ్లి జరిగింది... ఇప్పటికీ ఒక కోరిక మిగిలిందంటున్న హీరోయిన్..
Kamna Jethmalani

Updated on: Jul 08, 2021 | 9:01 AM

టాలెంటెడ్ హీరో గోపిచంద్ సరసన రణం వంటి సూపర్ హిట్ సినిమాతో గుర్తింపు పొందింది హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూనే.. ఆకస్మాత్తుగా వెండితెరకు దూరమయ్యారు. అయితే వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడిపిన కామ్నా.. అదే సమయంలో ఎన్నో పెద్ద సినిమాలను మిస్ చేసుకుందట. అలాగే కెరీర్ టాప్‏లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామ్నా మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంతోపాటు.. సినిమాల్లోనూ నటించాలనుందంటూ ఆసక్తికర విషయాలను చెప్పుకోచ్చింది.

తనది సింధీ ఫ్యామిలీ అని.. మా కుటుంబంలో 21 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేస్తారని.. కానీ మా అమ్మ నాకు సపోర్ట్ చేసిందని కామ్నా జెఠ్మలానీ చెప్పారు. ఆ తర్వాత మోడలింగ్, డ్యాన్సర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసానని.. మొదటి జీతం రూ. 300 అని తెలిపింది. అలాగే తాను పడిన కష్టం గురించి ముందే తన భర్తకు చెప్పానని కామ్నా అన్నారు. నిశ్చితార్థం సమయంలో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయని.. ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే పెళ్లి చేసుకున్నానని… కానీ ఇప్పటికీ నటన అంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది. తనకు సినిమాలు చేయమంటే ఇష్టమని.. అందుకు తన భర్త కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం తనకు పూరీ జగన్నాథ్ సినిమాలో నటించాలనుందని.. అలాగే రాజమౌళి సినిమాలో ఒక చిన్న పాత్ర అయిన చేయాలనుందని తెలిపింది. ఇవే కాకుండా.. ఓ స్పెషల్ సాంగ్ చేయాలనుందని చెప్పుకొచ్చింది కామ్నా.

Also Read: Walk Benfits : భోజనం చేశాక 10 నిమిషాలు నడవాలి..! ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

Pooja Hegde: రెమ్యునరేషన్ పెంచిన పూజా హెగ్డే.. అయినా తగ్గని ఆఫర్లు.. రెండు సినిమాలకు ఓకే..

Fennel Tea : సోంపు టీతో జీర్ణ సమస్యలకు చెక్..! క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం..? ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోండి..

TS Theatres: థియేటర్లు అప్పటిదాకా తెరవబోము.. నిర్మాతలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఎగ్జిబిటర్లు..