Kamakshi Bhaskarla: అవసరం అయితే అలాకూడా నటిస్తా.. దేనికైనా రెడీ అంటున్న కామాక్షి భాస్కర్ల

విరూపాక్ష అలాగే మా ఉరి పొలిమేర సినిమాలో తన నటనతో కట్టిపడేసింది. పొలిమేర 2లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది కామాక్షి భాస్కర్ల. ఆతర్వాత ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, రౌడీ బాయ్స్‌, ఓం భీమ్‌ బుష్‌ సినిమాల్లోనూ నటించింది. అలాగే సైతాన్‌ అనే బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించి అందరికి ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Kamakshi Bhaskarla: అవసరం అయితే అలాకూడా నటిస్తా.. దేనికైనా రెడీ అంటున్న కామాక్షి భాస్కర్ల
Kamakshi Bhaskarla

Updated on: May 31, 2024 | 7:23 PM

సరైన క్యారెక్టర్ దొరికితే చాలు తమ నటనతో ప్రేక్షకుల కట్టిపడేస్తున్నారు. అలాంటి వారిలో కామాక్షి భాస్కర్ల ఒకరు. చేస్తుంది చిన్న పాత్రలే అయినా తన నటనతో కట్టిపడేస్తుంది ఈ చిన్నది. సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. విరూపాక్ష అలాగే మా ఉరి పొలిమేర సినిమాలో తన నటనతో కట్టిపడేసింది. పొలిమేర 2లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది కామాక్షి భాస్కర్ల. ఆతర్వాత ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, రౌడీ బాయ్స్‌, ఓం భీమ్‌ బుష్‌ సినిమాల్లోనూ నటించింది. అలాగే సైతాన్‌ అనే బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించి అందరికి ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కామాక్షి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కామాక్షి ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అంటుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న ఏ పాత్ర అయినా తాను నటిస్తానని అంటుంది కామాక్షి. అమాయకు పాత్ర అయినా.. బోల్డ్ పాత్ర అయినా తాను సిద్దంగానే ఉన్నాను అంటుంది కామాక్షి. అలాగే  కామాక్షి మాట్లాడుతూ .. నటిగా నా పాత్రను పండించడం నా కర్తవ్యం.

నటనకు ప్రాధాన్యత ఉన్న ఏ పాత్ర అయినా నేను చేయండనికి రెడీ. కథ డిమాండ్ చేస్తే.. సన్నివేశం డిమాండ్ చేస్తే న్యూడ్ గాను నటిస్తాను అంటుంది కామాక్షి. ఎందుకంటే నేను ఈ రోజు ఉండి.. రేపు పోయే అందం గురించి ఇమేజ్ గురించి నేను పట్టించుకోనూ అని తెలిపింది కామాక్షి.  అలాగే నేను మంచి డాన్సర్ ని.. అవసరమైతే హీరోల పక్కన స్పెషల్ సాంగ్ కూడా చేస్తాను. ఇవన్నీ గుర్తించి నాకు దర్శకులు అవకాశాలు ఇవ్వాలి అని చెప్పుకొచ్చింది కామాక్షి భాస్కర్ల. మరి ఈ చిన్నది టాలెంట్ ను గుర్తించి దర్శకులు మంచి ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి. ఇక సోషల్ మీడియాలో కామాక్షి చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.

కామాక్షి భాస్కర్ల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

కామాక్షి భాస్కర్ల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.