Kajal Aggarwal: ఆచార్య సినిమాలో లేని కాజల్.. అయినా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ?.. ఎంతంటే..

|

Apr 29, 2022 | 4:01 PM

థియేటర్లో మెగా సందడి షూరు అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Kajal Aggarwal: ఆచార్య సినిమాలో లేని కాజల్.. అయినా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ?.. ఎంతంటే..
Kajal
Follow us on

థియేటర్లో మెగా సందడి షూరు అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య (Acharya) సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పాజిటివ్ టాక్‏తో ఈ మూవీ దూసుకుపోతుంది. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ కొరటాల శివ. ఇందులో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. అయితే ఈ మూవీలో ముందు నుంచి మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని చిత్రయూనిట్ గతంలోనే ప్రకటించింది. అప్పట్లో విడుదలైన లాహే లాహే పాటలోనూ కాజల్ స్టెప్పులేసింది. కానీ అనుహ్యంగా ఆచార్య ట్రైలర్‏లో కాజల్ కనిపించలేదు. దీంతో ఆచార్యలో కాజల్ పాత్రను తొలగించారంటూ వార్తలు వినిపించాయి. నిజంగానే కాజల్ పాత్ర తొలగించామని.. అందుకు తగిన కారణాలను చెప్పుకొచ్చారు డైరెక్టర్ కొరటాల శివ. ఫస్ట్ షెడ్యూల్ పూర్తైన తర్వాత స్టోరీ పరంగా చిరంజీవికి ప్రేమ.. హీరోయిన్ ఉంటే బాగుండదని అనిపించి కాజల్ పాత్రను తొలగించినట్టు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని కాజల్ తోనూ చెప్పగా.. చిరునవ్వుతో తప్పుకుందని తెలిపారు.

తాజాగా ఓవైపు ఆచార్య సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరోవైపు కాజల్ గురించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తైన తర్వాత కాజల్ పాత్ర తొలగించారు. కానీ .. అప్పటికే అందుకు తగిన రెమ్యూనరేషన్ తీసుకుందట. ఈ సినిమా కోసం దాదాపు కోటిన్నర పారితోషికం కాజల్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది. అందుకే కాజల్ ఈ మూవీ నుంచి తప్పించిన పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇటీవలే కాజల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన కొడుకు పేరును నీల్ కిచ్లు అంటూ కాజల్ భర్త గౌతమ్ కిచ్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Acharya Movie Review: ఆచార్య అంచనాల సంచలనాలను అందుకున్నాడా.? మెగా మూవీ ఎలా ఉందంటే..

Acharya: మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాకోసం ట్రెండ్ అయిన ఐదుగురు భామలు వీరే

Tollywood : సౌత్ సినిమాలే శరణం అంటున్న బాలీవుడ్.. రీమేక్స్‌ వెంటపడుతున్న నార్త్ మేకర్స్‌

Siddhu Jonnalagadda : ఆ మలయాళ రీమేక్‌కు డీజే స్టార్ నో చెప్పారా..? కారణం ఇదేనా..?