AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజశేఖర్‌ను ఫ్రాడ్ అన్న జీవిత..! అసలు నిజం తెలిస్తే షాక్..!

టాలీవుడ్‌లో రాజశేఖర్, జీవితలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు.. హీరో రాజశేఖర్ ఏ నిర్ణయం తీసుకోవలన్నా.. జీవిత సలహాలు తప్పనిసరి అని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. దీంతో.. రాజశేఖర్ జీవితంగా.. జీవిత మారిపోయారు. కాగా.. ఇటీవలే ఓ షోలో.. జీవిత.. రాజశేఖర్‌‌ల గురించి పలు ఆసక్తికర నిజాలు బయటపెట్టారు. రాజశేఖర్‌ను.. జీవిత ఫ్రాడ్ అని పిలిచేవారట. అందుకు గల కారణంను కూడా ఆవిడ చెప్పారు. జీవిత.. రాజశేఖర్‌ల మొదటి సినిమా ‘తలంబ్రాలు’. ఈ చిత్రం నుంచే […]

రాజశేఖర్‌ను ఫ్రాడ్ అన్న జీవిత..! అసలు నిజం తెలిస్తే షాక్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 09, 2019 | 2:08 PM

Share

టాలీవుడ్‌లో రాజశేఖర్, జీవితలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు.. హీరో రాజశేఖర్ ఏ నిర్ణయం తీసుకోవలన్నా.. జీవిత సలహాలు తప్పనిసరి అని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. దీంతో.. రాజశేఖర్ జీవితంగా.. జీవిత మారిపోయారు. కాగా.. ఇటీవలే ఓ షోలో.. జీవిత.. రాజశేఖర్‌‌ల గురించి పలు ఆసక్తికర నిజాలు బయటపెట్టారు. రాజశేఖర్‌ను.. జీవిత ఫ్రాడ్ అని పిలిచేవారట. అందుకు గల కారణంను కూడా ఆవిడ చెప్పారు.

జీవిత.. రాజశేఖర్‌ల మొదటి సినిమా ‘తలంబ్రాలు’. ఈ చిత్రం నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ కూడా పుట్టింది. ఈ సినిమాలో రాజశేఖర్ నెగిటీవ్ రోల్‌లో కనిపించారు. అందులో జీవిత.. రాజశేఖర్‌ను ఫ్రాడ్ అని పిలిచేదాన్ని అని చెప్పారు. ఇక అప్పటినుంచీ ఆ పిలుపు అలవాటైందని.. సెట్స్‌లో కూడా ఆయన్ని సరదాగా ఫ్రాడ్‌ అనే పిలిచానని తెలిపారు. కాగా.. ‘మగాడు’ సినిమా షూటింగ్‌ సమయంలో రాజశేఖర్‌కు ప్రమాదం జరగడంతో.. ఆస్పత్రిలో చేర్పించారు. ఆ టైంలో ఆయన తల్లిదండ్రులు కూడా ఊళ్లో లేరని.. సర్జరీ అయిపోయిన తర్వాత వచ్చారని.. అప్పటికే నేను ఆస్పత్రిలో ఉన్నాని చెప్పుకొచ్చారు. ఆస్పత్రిలో కూడా నేను రాజశేఖర్‌ను ఫ్రాడ్.. ఫ్రాడ్ అని పిలవడంతో.. వాళ్ల అమ్మకు కోపం వచ్చి.. నన్ను పక్కకి పిలిచి.. ఫ్రాడ్ ఏంటి.. సరిగ్గా పిలువు.. నాకు నచ్చలేదని చెప్పినట్టు జీవిత అన్నారు. దీంతో.. అప్పటి నుంచి నేను.. రాజశేఖర్‌ను ఫ్రాడ్‌ అని పిలవడం మానేసి.. ‘బంగారం’ అని పిలుస్తానని చెప్పారు జీవిత రాజశేఖర్.

ఇడ్లీ పిండితోనూ క్రిస్పీ ఎగ్ పకోడా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
ఇడ్లీ పిండితోనూ క్రిస్పీ ఎగ్ పకోడా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి..లేదంటే అయిపోతారు
కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి..లేదంటే అయిపోతారు
ఏపీలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమం
ఏపీలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమం
PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు..
PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు..
ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్
ఆహా.. ఏమి అందం! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము..ఏం చేసిందంటే
ఆహా.. ఏమి అందం! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము..ఏం చేసిందంటే
తొలి ట్రోఫీ కోసం మాజీ ఛాంపియన్‌తో పోటీకి సిద్ధమైన ఢిల్లీ..
తొలి ట్రోఫీ కోసం మాజీ ఛాంపియన్‌తో పోటీకి సిద్ధమైన ఢిల్లీ..
రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. అకౌంట్లోకి అప్పుడే..
రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. అకౌంట్లోకి అప్పుడే..
మ్యాచ్ గెలిచినా.. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఓటమే..
మ్యాచ్ గెలిచినా.. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఓటమే..