Tollywood: రెండోసారి తల్లికాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోస్ వైరల్..
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు అగ్రకథానాయికగా దూసుకుపోయింది. చేతినిండా సినిమాలతో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఇండస్ట్రీలో సత్తా చాటింది. కట్ చేస్తే ఊహించని విధంగా సినిమాలకు దూరమైంది. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు అక్కడ కూడా అంతగా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ సరదాగా గడుపుతుంది.

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ అగ్ర హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దళపతి, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. మొదటి సినిమాతోనే తెలుగులో బ్లా్క్ బస్టర్ హిట్ అందుకున్న ఈఅమ్మడు.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కొన్నాళ్ల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చిన ఈ హీరోయిన్ .. ఇప్పుడు మరోసారి తల్లికాబోతుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. ఇలియానా. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు నటిగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.
మహేష్ బాబుతో కలిసి నటించిన పోకిరి సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఈమూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలియానా పేరు మారుమోగింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాలలో నటించిన ఈ బ్యూటీ.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మైఖేల్ డోలన్ అనే విదేశీయుడితో డేటింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ 2023లో పండంటి బాబుకు జన్మనిచ్చింది. తన కొడుకుకు ఫీనిక్స్ డోలన్ అనే పేరు పెట్టినట్లు చెబుతూ.. కొడుకు ఫోటోస్ షేర్ చేసింది. అలాగే తన బాబు మొదటి పుట్టిరోజు వేడుకల ఫోటోస్ సైతం అభిమానులతో పంచుకుంది.
ఇప్పుడు ఇలియానా మరోసారి తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన స్నేహితురాలితో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టా స్టోరీలో పంచుకుంది. అందులో ఇద్దరూ బేబీ బంప్స్ తో కనిపిస్తున్నారు. బంప్ బడ్డీస్ అంటూ రాసుకొచ్చింది ఇలియానా.. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఇలియానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..
