పెద్ద హీరోయినేమీ కాదు.. అయినా గుడి కట్టి అభిమానిస్తున్న జనం
సౌత్ ఇండియా వాళ్లు సినిమా వాళ్లను మనుషులుగా కాదు.. దేవుళ్లుగా చూస్తారనే పేరుంది. ఆ పేరుకు తగ్గట్టే మన సౌత్‌లోని చాలా మంది స్టార్లకు గుళ్లు కట్టి పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే సర్‌ప్రైజింగ్‌లీ స్టార్ హీరోయిన్ హోదా లేకపోయినా.. ఈ సెలబ్రిటీల లిస్టులోకి ఎప్పుడో ఎక్కేసింది హీరోయిన్ నిధి అగర్వాల్.
నిధి అగర్వాల్ అంటే అభిమానించే కొంతమంది తమిళ తంబీలు.. చెన్నైలో ఈ బ్యూటీకి ఏకంగా గుడి కట్టారు. ఆమె బర్త్ డే రోజు… ఇంకొన్ని ప్రత్యేకమైన రోజుల్లో క్షీరాభిషేకం చేసి.. హారతిచ్చి పూజలు చేస్తారు. ఆమె స్టాచ్యూ ముందు కేక్ కట్ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నెట్టింట వైరల్ అవుతుంటాయి. మరోసారి కూడా ఇవి వైరల్ అవుతున్నాయి. నిధి అగర్వాల్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. నటనపై ఆసక్తితో చదువు మధ్యలోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మిస్టర్ మజ్ను సినిమాలోనూ నటించింది. అయితే రామ్ తో కలిసి నటించిన ఇస్మార్ట్ శంకర్ తో మొదటి సూపర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. తమిళంలోనూ శింబు, జయం రవి తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ అమ్మడికి సరైన హిట్ దక్కలేదు. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ పవన్ హరిహర వీరమల్లు సినిమాపై, ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా పై భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు సినిమాలతో … తన క్రేజ్ అండ్ రెమ్యునరేషన్ పెంచుకోవలని చేస్తోంది. స్టార్ హీరోయిన్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో వెలుగొందాలని అనుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాంతులు, కడుపునొప్పితో బాధపడిన మహిళ.. సీటీ స్కాన్ చేసిన వైద్యులకు షాక్
ఇద్దరు పిల్లల తల్లి.. పెళ్లి కాని పోరడుతో ఎఫైర్.. చివరికి కథ కంచికి.. మనం ఇంటికి
నాసాకే చెమటలు పట్టించిన భారతీయ కుర్రాడు.. అట్లుంటది మనతోని
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

