నాసాకే చెమటలు పట్టించిన భారతీయ కుర్రాడు.. అట్లుంటది మనతోని
కాన్పూర్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి యువరాజ్ గుప్తా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ NASA కు చెమటలు పట్టించాడు. ఏకంగా నాసా అధికారిక మెయిల్ ఐడీ హ్యాక్ అయ్యే బగ్ కనిపెట్టి.. వాళ్లకు పంపించాడు. దీంతో నాసా తొలుత కంగారు పడినా.. ఆ కుర్రాడి మేథస్సుకు ఫిదా అయిపోయింది. యువరాజ్‌కు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించింది.
చాలా మంది సైబర్ నిపుణులు గుర్తించలేని వాటిని గుర్తించినందుకు యువరాజ్‌ను నాసా ఈ విధంగా గౌరవించింది. ఈ కుర్రాడు NASA వెబ్‌సైట్‌లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనుగొన్నాడు . దీని ద్వారా NASA అధికారిక ఈమెయిల్ ID హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని, ఎవరైనా NASA ఈమెయిల్ చిరునామాను ఉపయోగించి నకిలీ సందేశాలను పంపవచ్చని తేల్చాడు. యువరాజ్ దామోదర్ నగర్‌లోని ఓ కాలేజీ లో 11వ తరగతి చదువుతున్నాడు. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ సైబర్ సెక్యూరిటీలో మంచి నాలెడ్జ్ సంపాదించాడు. 10వ తరగతిలో 79.4 శాతం ఉత్తీర్ణత సాధించాడు. యూట్యూబ్, ఆన్‌లైన్ కోర్సులు, పుస్తకాల ద్వారా హ్యాకింగ్ నేర్చుకున్నాడు. యువరాజ్ ఇటీవల NASA బగ్ బౌంటీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. NASA పేరుతో నకిలీ ఈమెయిల్‌లను పంపడానికి అనుమతించే బగ్‌ను కనుగొన్నాడు. దాదాపు రెండు వారాల నిరంతర ప్రయత్నం తర్వాత యువరాజ్ పూర్తి నివేదికను తయారు చేసి, వీడియోతో పాటు నాసాకు పంపాడు. అతడు నకిలీ ఈమెయిల్స్, ఇంకా లోపాల గురించి కూడా సమాచారం రాబట్టాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
