పేరు తీయకుండా.. వంగాకు కౌంటర్ ఇచ్చిన దీపిక
బిడ్డ పుట్టిన తర్వాత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న దీపికా.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో ఈ అమ్మడు నటించనున్నట్లు ప్రచారం నడిచింది. కానీ కొన్ని కారణాలతో ఆమెను తప్పించి దీపికా స్థానంలోకి త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు డైరెక్టర్ వంగా..!
కానీ కట్ చేస్తే… సందీప్ రెడ్డి వంగా ఉన్నట్టుండి దీపిక టీంపై ఫైర్ అవుతూ ట్వీట్ చేశాడు. ఒక్క సారిగా బాలీవుడ్‌లో సెన్సేషన్ అయ్యాడు. ఇక దాన్ని కంటన్యూ చేస్తూ.. తాజాగా దీపిక్ కూడా ఓ కామెంట్ చేసింది. సందీప్ రెడ్డి వంగా పేరు తీయకుండా… తాను మనసుకు నచ్చిందే చేస్తానంటూ… డైరెక్టర్ వంగాకు కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా దీపికా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా.. అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకుంది. జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యమని.. దానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనసు చెప్పేది వింటానని.. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటానని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

