వాంతులు, కడుపునొప్పితో బాధపడిన మహిళ.. సీటీ స్కాన్ చేసిన వైద్యులకు షాక్
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో వైద్యులు ఒక అరుదైన కేసును డీల్ చేశారు. ఒక మహిళ తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో ఆసుపత్రికి వచ్చింది. ప్రాథమిక పరీక్షలు చేయగా.. కడుపులో ఏదో ఉందని గుర్తించారు. అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ వంటి పరీక్షల అనంతరం అది మానవ జుట్టుతో ఏర్పడిన ఓ ఉండగా నిర్ధారించారు. ఈ సంఘటన మండీ జిల్లాలోని నేర్ చౌక్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది.
బాధితురాలు మానసిక రుగ్మతలతో బాధపడుతూ, అనేక సంవత్సరాలుగా తన జుట్టును తానే తినటం వల్ల ఆ జుట్టు ఒక బాల్‌లా కడుపులో పేరుకుపోయింది. డాక్టర్ రాహుల్ మృగ్పురి, డాక్టర్ అజయ్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ ను నిర్వహించారు. డాక్టర్ ష్యామ్లీ, డాక్టర్ పంకజ్.. నర్సింగ్ సిబ్బంది ఈ సర్జరీలో కీలక భూమిక పోషించారు. ఆపరేషన్ విజయవంతమైందని.. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ అరుదైన పరిస్థితిని ట్రైకోబేజోర్ అని పిలుస్తారని వైద్యులు తెలిపారు. ఇది చాలా అరుదుగా కనిపించే వ్యాధి. ఇందులో జుట్టు లేదా ఇతర జీర్ణంకాలేని పదార్థాలు కడుపులో చేరి పెద్ద బాల్ మాదిరిగా మారతాయి. సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజనీష్ శర్మ ఈ కేసును అరుదైనదిగా పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలో ఉన్న అవగాహనా లోపమే ఇలాంటి సమస్యలకు దారితీస్తుందని వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇద్దరు పిల్లల తల్లి.. పెళ్లి కాని పోరడుతో ఎఫైర్.. చివరికి కథ కంచికి.. మనం ఇంటికి
నాసాకే చెమటలు పట్టించిన భారతీయ కుర్రాడు.. అట్లుంటది మనతోని

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
