నాగ చైతన్య బంగారం.. సమంత రెండో పెళ్లిపై నటి హేమ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న వీరు డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సమంత పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

నాగ చైతన్య బంగారం.. సమంత రెండో పెళ్లిపై నటి హేమ కామెంట్స్..
Samantha

Updated on: Dec 03, 2025 | 5:41 PM

సమంత.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతున్న పేరు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత.. తాజాగా రెండో వివాహం చేసుకుంది. సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. సోమవారం (డిసెంబర్ 1)న వీరిద్దరు కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సమంత -రాజ్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సామ్- రాజ్ ల భూత శుద్ది పద్దతిలో జరిగినట్టు ఈషా ఫౌండేషన్ కూడా ఒక అధికారిక ప్రకటన వెలువరించింది.

వారెవ్వా..! ఈ ఇద్దరూ ఒక్కటేనా..!! అప్పుడు అలా.. ఇప్పుడు హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా మారి ఇలా..

ఇక సోషల్ మీడియాలో సమంత, రాజ్ పెళ్లి ఫొటోలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సమంత తన పెళ్లి ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. కాగా ఈ ఫోటోలు కొందరు నెటిజన్స్ సమంతను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సమంత రెండో పెళ్లి పై నటి హేమ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా హేమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో హేమకు సమంత పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమిస్తూ.. “అందరూ సమంత గురించే మాట్లాడుతున్నారు. నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు ఎవ్వరు అడగలేదు. సమంత పెళ్లి చేసుకోవడం మంచి విషయం.. కానీ దాన్ని ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారో అర్ధంకావడం లేదు. ఆడదానికి డబ్బుందని పాయింట్ అవుట్ చేయడం ఏంటి.? ఆ అమ్మాయి లైఫ్, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, కంగ్రాట్స్ చెప్పాలి. ఇప్పుడు సమంతకు ఓ తోడు కావలి. హెల్త్ విషయంలో, మెంటల్ కండీషన్ కావొచ్చు ఈ టైం లో ఆమెకు ఓ సపోర్ట్ కావాలి. తనకు నచ్చి చేసుకుంది. ఇప్పుడు నచ్చి చేసుకోవడంలో అన్నీ లీగలే.. తాను చాలా హ్యాపీగా ఉండాలి. అలాగే నాగ చైతన్య కూడా చాలా మంచి వాడు. విడిపోయినప్పుడు.. వాళ్ళిద్దరికీ నచ్చి.. ఓ అండర్ స్టాండింగ్ తో విడిపోయారు. నాగ చైతన్యా చాలా మంచి వ్యక్తి.. నాగార్జున ఫ్యామిలీలో అందరూ బంగారాలు అని చెప్పుకొచ్చారు.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. బయట మాత్రం బీభత్సం భయ్యా..!

కాగా ఏది ఏమైనా సమంత రాజ్ తో కొత్తజీవితాన్ని ప్రారంభించడం పై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏమాయ చేసావె’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగచైతన్యను 2017లో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ, క్రైస్టవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. అయితే, పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు 2021లో ప్రకటించింది ఈ జంట. టాలీవుడ్‌ అందమైన జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో సంచలన వార్త.  సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే..

ఇవి కూడా చదవండి

అమ్మబాబోయ్.. అల్లరి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .