AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా..! ఈ ఇద్దరూ ఒక్కటేనా..!! అప్పుడు అలా.. ఇప్పుడు హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా మారి ఇలా..

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీల ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల భామ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వారెవ్వా..! ఈ ఇద్దరూ ఒక్కటేనా..!! అప్పుడు అలా.. ఇప్పుడు హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా మారి ఇలా..
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Dec 03, 2025 | 6:36 AM

Share

బుల్లితెరపై అందం, అభినయంతోనే కాదు.. చలాకీ మాటలతో ప్రేక్షకులను అలరించడంలో యాంకర్స్ ముందుంటారు. తెలుగులో సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు స్టార్ యాంకర్స్ గా రాణిస్తున్నారు. షోలలో తమదైన కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తారు. అలాగే మరికొంత మంది యాంకర్స్ కూడా తమదైన స్టైల్లో అలరిస్తుంటారు. పైన ఫోటోను చూశారు కదా..పద్దతిగా కనిపిస్తున్న ఆ అమ్మాయి కూడా యాంకరే. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు రియాల్టీ షోలలో యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు ప్రైవేట్ సాంగ్స్, మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. యాంకర్ గా తన అందంతో చలాకీతనంతో మెప్పిస్తుంది. ఇంతకీ పైన ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..?

ఇప్పుడు బిగ్‏బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ ఆ అమ్మాయి. తనే యాంకర్ విష్ణుప్రియ. మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసింది విష్ణుప్రియ. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా మారి ప్రేక్షకులను అలరించింది. పోవే పోరా షోతో యాంకర్ గా సినీ ప్రయాణంలో కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు.. తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు షోలలోనూ యాంకరింగ్ చేస్తూ తెలుగువారికి దగ్గరయ్యింది. అలాగే ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే సంతోష్ శోభన్ నటించిన బేకర్ అండ్ ది బ్యూటీ చిత్రంలో నటించింది. ఓవైపు యాంకరింగ్ చేస్తున్న విష్ణు.. ఇటు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. నిత్యం ఫోటోషూట్స్, రీల్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది.

అలాగే ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం విష్ణు బిగ్‏బాస్ సీజన్ 8 రియాల్టీ షోలో కంటెస్టెంట్. మొదటి వారం నుంచే తన ఆట తీరు, ప్రవర్తనతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సీజన్ అత్యంత డిమాండ్ ఉన్న కంటెస్టెంట్ విష్ణు. నివేదికల ప్రకారం ఈ సీజన్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ కూడా విష్ణు కావడం విశేషం. ఆమెకు వారానికి రూ.5.5 లక్షలు చెల్లిస్తున్నారని తెలుస్తోంది. రోజు రోజుకు విష్ణుకు అడియన్స్ సపోర్ట్ పెరుగుతుంది. అంతేకాదు.. ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్ కూడా అని అంటున్నారు. ప్రస్తుతం విష్ణుకు సంబంధించిన చిన్ననాటి ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

Follow Us