
90’sలో సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్లలో గౌతమి ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందంతోపాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. బామ్మమాట బంగారు మూట, చైతన్య, అన్నా, పల్లెటూరి, శ్రీవెంకటేశ్వర కళ్యాణం, చిలక్కొట్టుడు వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటనకు ప్రశంసలతోపాటు తమిళనాడు ప్రభుత్వం చేతుల మీదుగా పలు పురస్కారాలు అందుకుంది. భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ భాటియాను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. వీరికి సుబ్బలక్ష్మి అనే కూతురు ఉంది. అయితే కొన్ని కారణాలతో వీరిద్దరు పెళ్లైనా ఏడాదికే విడాకులు తీసుకున్నారు. 1998లో వివాహం జరిగితే.. 1999లో విడిపోయారు.
ఆ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన గౌతమి తన కూతురితో కలిసి ఒంటరిగానే నివసించింది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తుంది గౌతమి. ఇదిలా ఉంటే తాజాగా ఆమె కూతురుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గౌతమి కూతురు సుబ్బలక్ష్మి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. అలాగే నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తుంది. సుబ్బలక్ష్మి అచ్చం తన తల్లిలాగే మరింత అందంగా కనిపిస్తుంది. ట్రెడిషనల్ లుక్స్ లో సుబ్బలక్ష్మి షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
అయితే గౌతమి కూతురు త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ గౌతమి మాత్రం ఇప్పటికీ వరుస సినిమాలతోఅలరిస్తుంది. 2004 నుంచి 2016లో హీరో కమల్ హాసన్ తో గౌతమి సహజీవనం చేశారు. ఆ తర్వాత వీరి బంధం ముందుకు సాగలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తుంది గౌతమి.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..