Faria Abdulla: క్యాబ్ డ్రైవర్‌కు నా పేరు చిట్టి అని చెప్పగానే ఊహించని ఘటన జరిగింది.. అసలు విషయం చెప్పిసిన ఫరియా..
చిట్టి పేరుతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాలో ఫరియా తన నటనతో మెప్పించింది. అయితే చిట్టి అని పేరు చెప్పినందుకు క్యాబ్ డ్రైవర్ నుంచి ఊహించని ఘటన ఎదురైందని తెలిపింది.
యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ . ఇందులో సంతోష్ సరసన జాతిరత్నాలు ఫేమ్ చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్, పాటలు సినిమా అంచనాలను పెంచాయి. ఈ మూవీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇటీవల చిత్రయూనిట్ అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జాతిరత్నాలు సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు ఫరియా..
ఫరియా అబ్దుల్లా కంటే.. చిట్టి అనే పేరుతోనే కదా నిన్ను బయట పిలుస్తున్నారు అని అలీ అనగా.. ఫరియా మాట్లాడుతూ.. ” ఓసారి క్యాబ్ లో వెళ్తున్నాను. డ్రైవర్ చాలా డల్ గా ఉన్నాడు. దీంతో ఏమైంది అన్నా అని మాట్లాడటం స్టార్ట్ చేశాను. వెంటనే అతను తన చిన్నప్పటి క్రష్ చిట్టి అని.. తన గురించి చెప్తూ బాధపడ్డాడు. ఓ అవునా అని నా పేరు కూడా చిట్టినే అని చెప్పాను.
వెంటనే రోడ్డు మధ్యలో కార్ ఆపేసి వెనక్కి తిరిగి ఏ స్కూల్ మీరు అని అడిగాడు. నేను షాకయ్యాను. అతను తన చిన్నప్పటి చిట్టిని నేను అనుకున్నాడు. మళ్లీ నా అసలు పేరు చెప్పి.. ఇది సినిమాలో నా పేరు అని చెప్పి మొత్తం వివరించిన తర్వాత కార్ స్టార్ట్ చేశాడు ” అంటూ చెప్పుకొచ్చింది. డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన జాతి రత్నాలు సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన నటించింది ఫరియా. ఈ మూవీ ఆమె చిట్టి పాత్రలో అందంగా అలరించి అభిమానులకు ఆకట్టుకుంది. ప్రస్తుతం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే కాకుండా.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీలోనూ ఫరియా నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.