Divya Bharathi : ఆ స్టార్ హీరో అంటే పిచ్చి.. ఆ సినిమా ఎన్నిసార్లు చూశానో.. హీరోయిన్ దివ్య భారతి..
తమిళంలో వరుస విజయాలతో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ దివ్య భారతి. ముఖ్యంగా తొలి చిత్రంలో రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమయ్యేందుకు రెడీ అయ్యింది. కానీ తెలుగులో మొదటి సినిమా విడుదల కాకుండానే వివాదాలతో వార్తలలో నిలిచింది.

దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దివ్య భారతి. కాలేజీ రోజుల్లో అందంగా లేదని విమర్శలు చేసిన వారే.. ఇప్పుడు గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్నారు. ప్రస్తుతం కుర్రవాళ్ల ఆరాధ్య దేవత ఈ అమ్మడు. తమిళంలో బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించగా.. ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో గ్లామర్ సీన్లలో రెచ్చిపోయింది. అంతేకాదు.. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆ తర్వాత తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమాలో కనిపించింది కాసేపే అయినా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ సినిమాకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
ఇన్నాళ్లు తమిళంలో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగు తెరకు పరిచయమయ్యేందుకు రెడీ అయ్యింది. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల సినిమా విడుదల కాకుండానే వివాదాలతో వార్తలలో నిలిచింది దివ్య భారతి. డైరెక్టర్ చిలక అంటూ చేసిన కామెంట్స్ పై ధీటుగానే రియాక్ట్ అయ్యింది. ఇదెలా ఉంటే.. ఈ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
తెలుగులో తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఇష్టమని తెలిపింది. ఆయన నటించిన ఖుషి సినిమా తనకు తెగ నచ్చిందని.. ఇప్పటివరకు ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదని తెలిపింది. అలాగే పుష్ప రాజ్.. అల్లు అర్జున్ సైతం తనకు ఇష్టమని అన్నారు దివ్య భారతి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

Divya Bharathi, Pawan Kalya
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
