Ravi Babu : ఆ హీరోయిన్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. రవి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న కంటెంట్ చిత్రాలతో మంచి విజయాలను సాధించిన దర్శకులలో రవిబాబు ఒకరు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. హారర్, మిస్టరీ, సస్పెన్స్ చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ ప్రయాణంలో ఒక హీరోయిన్ తనను ఇబ్బంది పెట్టిందంటూ గుర్తుచేసుకున్నారు. అలాగే తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు రవిబాబు. అలాగే నటుడిగా, నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. విభిన్న కంటెంట్ చిత్రాలతో మెప్పించిన రవిబాబు.. ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవిబాబు.. హీరోయిన్ పూర్ణతో తనకున్న స్నేహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రవిబాబు దర్శకత్వంలో పూర్ణ మూడు నుంచి నాలుగు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. వారి మధ్య చాలా స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, మొదటి సినిమా సమయంలో డేట్స్ విషయంలో చిన్న సమస్య వచ్చినప్పటికీ, ఆ తర్వాత వారి స్నేహం మరింత బలపడిందని రవిబాబు తెలిపారు. “అదుగో” సినిమా ప్రమోషనల్ సాంగ్ కోసం అనేక మంది హీరోయిన్లను సంప్రదించామని.. కానీ అందరు నిరాకరించారని.. పూర్ణ వెంటనే అంగీకరించి ఒక రోజు షూటింగ్ చేసి వెళ్ళిపోయారని అన్నారు.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
ఈ ఘటన వారి మధ్య ఉన్న పరస్పర స్నేహానికి నిదర్శనమని రవిబాబు అన్నారు. అలాగే, ఒక సినిమా పోస్టర్ షూట్ సమయంలో కెమెరాలో చిప్ లేని సంఘటనను రవిబాబు వివరించారు. పూర్ణ డేట్స్ విషయంలో ఎదురైన ఆలస్యం కారణంగా, కేవలం రెండు రోజులలో షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. అందులో ఒక అర రోజు పోస్టర్ షాట్ కోసం కేటాయించారు. ఆ సమయంలో రవిబాబు కొంత అసహనంతో ఉన్నందున పూర్ణతో ఎక్కువగా మాట్లాడలేదని, దీంతో ఆమె కూడా కొంత అసౌకర్యానికి గురయ్యారని తెలిపారు. మరుసటి రోజు పోస్టర్ షాట్ కోసం పూర్ణను రోప్‌లతో కట్టి పైకి వేలాడదీసి రెడ్ చీరలో ఫోటోలు తీశారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
దాదాపు ఒక గంట పాటు ఆ షాట్ కోసం ఆమె కష్టపడ్డారు. ఫోటోలు తీసిన తర్వాత, స్టిల్ ఫోటోగ్రాఫర్‌ను ల్యాప్‌టాప్‌లో ఫోటోలు చూపించమని అడగ్గా, కెమెరాలో చిప్ లేదని అసిస్టెంట్ చెప్పాడని… ఈ పొరపాటు వల్ల పూర్ణ ఏదో ఉద్దేశపూర్వకంగా టార్చర్ చేసినట్లు భావిస్తుందేమోనని వెంటనే ఆమెతో మాట్లాడి వివరణ ఇచ్చానని గుర్తుచేసుకున్నారు.. ఆ సంఘటన ఎటువంటి ప్రతీకారం కాదని, అది కేవలం ఫోటోగ్రాఫర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని స్పష్టం చేశారు. ఈ సంఘటన తర్వాత, రవిబాబు షూటింగ్‌లకు వచ్చిన ప్రతిసారీ ఫోటోగ్రాఫర్‌ను చిప్ ఉందా లేదా అని అడుగుతారని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
