
Charmy Kaur: ఆడపులి, శివంగీ.. అంటూ తెరపై కుర్రకారు మదిని దోచింది.. ఛార్మికౌర్. 15 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి ‘నీ తోడు కావాలి’ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తన క్యూట్ స్మైల్ తో టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. లేటు వయస్సులో ప్రొడక్షన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ.. అక్కడ కూడా హిట్స్ అందుకుంటుంది. ఇవాళ బర్త్ డే జరుపుకుంటున్న ఛార్మి కౌర్ సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందామా.
1987 మే 17న హైదాబాద్‌కు చెందిన పంజాబీ ఫ్యామిలీలో జన్మించిన ఛార్మి కౌర్ పేరుకు పంజాబీ పిల్ల అయినా.. తెలుగమ్మాయిలా గల గలా మాట్లాడే ఈ అమ్మడు.. టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి వచ్చినా.. శ్రీ ఆంజనేయంతో ఫస్ట్ హిట్ కొట్టింది. అందులో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. మాస్ మూవీలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రభాస్ తో చక్రం మూవీ చేసిన ఛార్మి.. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజులో అద్భుతంగా నటించింది. ఈ మూవీ అంతా తానొక్కరై నటించింది. ఇందులో నటనకు గాను ఛార్మి.. ప్రశంసలు అందుకుంది. మంగళ మూవీలో తన నటనకు ఛార్మికి నంది అవార్డు దక్కింది. తర్వాత బాపు కన్నుల్లో పడ్డ ఈ చిన్నది.. అచ్చమైన తెలుగమ్మాయిలా సుందరకాండ మూవీలో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు.. సౌత్ లో అన్ని భాషల్లో నటించిన ఆమె.. బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. జ్యోతిలక్ష్మీ మూవీతో ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ప్రొడక్షన్ లో వరుసగా మూవీస్ చేస్తుంది. అయితే ఇటీవలే ఛార్మి పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ రూమర్ వైరల్ అయ్యింది. అంతలోనే ఇప్పట్లో తనకా ఉద్దేశ్యం లేదని సింపుల్ గా తేల్చిచెప్పింది. 34 ఏళ్లు పూర్తవుతున్నా.. మూడుముళ్లపై ముచ్చట లేదంటుంది ఛార్మి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న లైగర్ సినిమాను నిర్మిస్తుంది.
Also Read: PF ఖాతాదారులకు శుభవార్త.. ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రతి నెల అకౌంట్లోకి డబ్బులు..