Brigida Saga: పెళ్లిపీటలెక్కిన యంగ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరో తెలుసా?
బ్రిగిడా సాగా.. పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ పై ఫొటో చూస్తే ఈ డస్కీ బ్యూటీని ఇట్టే గుర్తు పడతారు. తమిళ సీరియల్స్, తెలుగు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సీక్రెట్ గా ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రముఖ నటి బ్రిగిడ సాగా శుభవార్త చెప్పింది. తమిళ సీరియల్స్, తెలుగు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరోయిన్ సడెన్ గా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు ఆనంద్ రామ్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. వినాయక చవితి సందర్భంగా స్వయంగా బ్రిగిడినే ఈ శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు భర్తతో కలిసున్న ఫొటోలను కూడా షేర్ చేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వీరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం బ్రిగిడ సాగా పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న బ్రిగిడ- ఆనంద్ రామ్ ఈ ఏడాది జులైలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు పూల దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.
కాగ బ్రిగిడా సాగా సొంత భాష తమిళంతో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. తమిళ సీరియల్ ‘ఆహా కల్యాణం’లో పవి టీచర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళ మూవీ ‘అయోగ్య’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్‌స్పాట్ టూ మచ్ తదితర చిత్రాలు చేసింది. తెలుగులోనూ సింధూరం, పెదకాపు తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. కాగా ఈ ముద్దుగుమ్మను పెళ్లాడిన ఆనంద్ రామ్ ది కూడా సినిమా నేపథ్యమే. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన ‘మీసయ్య మురుక్క’ మూవీలో నటించాడు ఆనంద్ రామ్. అలాగే మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు. ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు.
బ్రిగిడ సాగా పెళ్లి ఫొటోస్..
View this post on Instagram
భర్తతో బ్రిగిడ సాగా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




