Viral Photo: ఈ ఫోటోలో ముద్దులొలుకుతున్న చిన్నారి ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. దివి నుంచి దిగివచ్చిన దేవకన్య..
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్
ప్రస్తుతం సోషల్ మీడియాలో చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. సామాన్యులవి.. సెలబ్రెటీల బాల్యస్మృతులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన సినీ తారలకు సంబంధించిన అరుదైన జ్ఞాపకాలు.. చిన్ననాటి విషయాలను తెలుసుకోవడానికి మరోవైపు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ హల్చల్ చేస్తున్నాయి కదూ. టాలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా అందరూ సెలబ్రెటీస్ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఓ చిన్నారి పిక్ ఇప్పుడు నెట్టింట వైర్ అవుతుంది. పైన ఫోటోలో తన తల్లితో ప్రేమగా కేక్ తింటున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈరోజు ఆ క్యూట్ చిన్నారి పుట్టినరోజు ఎవరో గుర్తుపట్టండి.
ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి మరెవరో కాదండోయ్.. హీరోయిన్ భూమిక. యువకుడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. పవన్ సరసన ఖుషి చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ త్రవాత మిస్సమ్మ, సింహాద్రి, వాసు, ఒక్కరు, జై చిరంజీవ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 2007లో భరత్ ఠకూర్ ను వివాహం చేసుకున్న తర్వాత భూమిక సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. న్యాచురల్ స్టార్ నాని నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రంలో నాని వదినగా నటించి మరోసారి ప్రశంసలు అందుకుంది. ఈరోజు (ఆగస్ట్ 21న ) భూమికా చావ్లా పుట్టినరోజు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి