సిల్వర్ స్ర్కీన్‌పై తమ అందం, అభినయంతో అలరిస్తోన్న సినిమా తారలు వరుసగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవల స్టార్ హీరోయిన్లు సమంత, మమతమోహన్‌దాస్, శ్రుతిహాసన్ తమకున్న హెల్త్ ఇష్యూస్‌ను బయటపెట్టి షాక్ ఇచ్చారు. అలాగే తాను గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాక్ ఇచ్చింది సీనియర్ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. ఇప్పుడీ జాబితాలోకి మరో స్టార్ హీరోయిన్ చేరింది. ఆమె మరెవరో కాదు అభిమానుల మదిలో స్వీటీగా గుర్తింపు తెచ్చుకున్న అందాల తార అనుష్కాశెట్టి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తాను ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు బయటపెట్టింది. ఒకసారి నవ్వడం స్టార్ట్ చేస్తే ఏకధాటిగా 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘నవ్వించే సంఘటన వస్తే పడి పడి నవ్వుతూనే ఉంటాను. అసలు నవ్వుని కంట్రోల్ చేసుకోలేను. ఇక షూటింగ్ సెట్‌లో నేను నవ్వడం స్టార్ట్ చేస్తే ఇక షూటింగ్ ప్యాకప్ చేసుకోవాల్సిందే. ఒకసారి నవ్వడం ప్రారంభిస్తే సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటాను. ఈ గ్యాప్‌లో ప్రొడక్షన్ వాళ్లు టిఫిన్స్, స్నాక్స్ లాంటివి కంప్లీట్ చేసుకుని వస్తారు’ అని తనకున్న అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చింది అనుష్క. కాగా అనుష్క ఇది సీరియస్ గా చెప్పుకొచ్చిందా? లేక సరదాగా చెప్పుకొచ్చిందా? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అయితే ‘నవ్వడం ఆరోగ్యానికి మంచిదేగా స్వీటీ. నువ్వు ఎంత సేపు నవ్వినా మాకు ఆనందమే’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది అనుష్క. మైత్రి మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..