Anupama Parameswaran: వరుస హిట్స్‏తో అనుపమ.. ఏకంగా రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా ?..

|

Dec 31, 2022 | 11:48 AM

ఇటీవల విడుదలైన 18 పేజిస్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది అనుపమ. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న ఈ కేరళ కుట్టి ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచినట్లుగా తెలుస్తోంది.

Anupama Parameswaran: వరుస హిట్స్‏తో అనుపమ.. ఏకంగా రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా ?..
Anupama Parameswaran
Follow us on

ఇప్పటివరకు సౌత్‏లో అభిమానులను సంపాదించుకుని ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అనుపమ. దక్షిణాదిలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఉత్తరాదిలోనూ ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సరసన అనుపమ నటించిన చిత్రం కార్తికేయ 2. ఈమూవీ పాన్ ఇండియా లెవల్లో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా.. అటు హిందీ ప్రేక్షకులు సైతం వీరిద్దరి నటనకు.. కథకు ఫిదా అయ్యారనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా తర్వాత ఇటీవల విడుదలైన 18 పేజిస్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న ఈ కేరళ కుట్టి ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచినట్లుగా తెలుస్తోంది.

తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం అనుపమ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 1.20 కోట్లు డిమాండ్ చేస్తుందట. గతంలో ఒక్క చిత్రానికి రూ. 60 లక్షలు మాత్రమే తీసుకునేదట. ఇక ఇప్పుడు వరుస హిట్స్ అందుకోవడం..పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ రావడంతో పారితోషికం పెంచేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

అయితే తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు తమిళంలో మాత్రం అంతగా కలిసి రావడం లేదు. ఇప్పటివరకు కోలీవుడ్ ఇండస్ట్రీలో అనుపమ విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం ఆమె జయం రవి నటిస్తోన్న సైరన్ సినిమాలో నటిస్తుంది. మరి చూడాలి ఈ మూవీతో సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.