Anshu Ambani: డైరెక్టర్ త్రినాథ రావు అసభ్యకర కామెంట్స్.. స్పందించిన హీరోయిన్.. ఏం చెప్పిందంటే..

|

Jan 14, 2025 | 7:22 AM

ఒకప్పుడు టాలీవుడ్ కుర్రాళ్ల కలల హీరోయిన్ అన్షు అంబానీ. చేసింది రెండు మూడు సినిమాలే అయినా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పట్లో ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉండేది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు సినిమాలకు దూరమైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు మజాకా సినిమాతో సినీరంగంలోకి రీఎంట్రీ ఇస్తుంది.

Anshu Ambani: డైరెక్టర్ త్రినాథ రావు అసభ్యకర కామెంట్స్.. స్పందించిన హీరోయిన్.. ఏం చెప్పిందంటే..
Trinadha Rao, Anshu Ambani
Follow us on

అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాతో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది హీరోయిన్ అన్షు అంబానీ. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించిన ఈబ్యూటీ అందం, అభినయంతో మెప్పించింది. అప్పట్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాతో మరోసారి అలరించిన అన్షు.. తర్వాత సినిమాలకు దూరమయ్యింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత మజాకా సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వస్తుంది. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ నటిస్తోన్న ఈసినిమాలో అన్షు కీలకపాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈసినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే టీజర్ లాంచ్ వేడుకలో డైరెక్టర్ త్రినాథ్ రావు మాట్లాడుతూ హీరోయిన్ అన్షు గురించి చేసిన అసభ్యకర కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె శరీరాకృతి గురించి అనుచితంగా మాట్లాడడంతో నెటిజన్స్, మహిళా కమిషన్ ఆగ్రం వ్యక్తం చేసింది. దీంతో తప్పు తెలుసుకున్న త్రినాధరావు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అన్షుతోపాటు మహిళందరికీ క్షమాపణలు చెప్పారు.

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ త్రినాథ్ రావు కామెంట్స్ హీరోయిన్ అన్షు స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “మజాకా సినిమా టీజర్ ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అలరించేందుకు వస్తున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. త్రినాథ రావు చేసిన వ్యాఖ్యల గురించి వస్తున్న కథనాలు చూస్తున్నాను. ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలోనే ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను తన ఫ్యామిలీ మనిషిగా చూసుకున్నారు. తనపై నాకు చాలా గౌరవం ఉంది. మజాకా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. త్రినాథ్ సర్ తో కలిసి చేసినందుకు హ్యాపీగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వడానికి ఇంతకంటే మంచి దర్శకుడు దొరకరేమో. ఆయన నాకు చాలా సలహాలు, సూచనలు ఇచ్చారు. తనపై గౌరవం తప్ప ఎలాంటి కోపం లేదు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయండి” అంటూ కోరింది.

ఇక అన్షు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మన్మథుడు, రాఘవేంద్ర సినిమాలతో అలరించిన అన్షు అంబానీ ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. పెళ్లి తర్వాత లండన్ లోనే సెటిల్ అయిపోయిన ఈ అమ్మడు.. దాదాపు 20 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తుంది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..