Anasuya Bharadwaj: స్టార్‌ యాంకర్‌ అనసూయ పెళ్లి ఫొటోస్‌ చూశారా? నవ వధువుగా ఎంత అందంగా ఉందో..

సినిమాల సంగతి పక్కన పెడితే గత మూడు రోజులుగా అనసూయ పేరు నెట్టింట బాగా వినిపిస్తోంది. దీనికి కారణం సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేస్తోన్న ఫొటోస్‌, వీడియోలే. జూన్‌4న అనసూయ- సుశాంక్‌ భరద్వాజ్‌ల పెళ్లిరోజు. ఈ క్రమంలో తన వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు విదేశాలకు వెళ్లిపోయారు అనసూయ దంపతులు.

Anasuya Bharadwaj: స్టార్‌ యాంకర్‌ అనసూయ పెళ్లి ఫొటోస్‌ చూశారా? నవ వధువుగా ఎంత అందంగా ఉందో..
Actress Anasuya Bharadwaj

Updated on: Jun 07, 2023 | 6:20 AM

ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై బిజీబిజీగా ఉంటోంది స్టార్ యాంకర్‌ అనసూయ. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా మెప్పించిన ఈ అందాల తార పుష్ప సినిమాతో మరింత బిజీగా మారిపోయింది. జబర్దస్త్‌ షోకు గుడ్‌బై చెప్పేసి బిగ్‌ స్ర్కీన్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే గత మూడు రోజులుగా అనసూయ పేరు నెట్టింట బాగా వినిపిస్తోంది. దీనికి కారణం సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేస్తోన్న ఫొటోస్‌, వీడియోలే. జూన్‌4న అనసూయ- సుశాంక్‌ భరద్వాజ్‌ల పెళ్లిరోజు. ఈ క్రమంలో తన వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు విదేశాలకు వెళ్లిపోయారు అనసూయ దంపతులు. ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తోన్న అనసూయ తన టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తోంది. ఇందులో అనసూయ హాట్‌గా కనిపించడం, భర్తకు లిప్‌లాక్‌ ఇస్తూ దర్శనమివ్వడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. కాగా తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన పెళ్లి నాటి ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది అనసూయ. ఇందులో పెళ్లి పీటలపై కుందనపు బొమ్మలా కూర్చుని ఎంతో అందంగా కనిపించిందీ స్టార్‌యాంకర్‌. ప్రస్తుతం అనసూయ పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఎప్పటిలాగే అనసూయ ఫొటోస్‌పై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నా.. మరి కొంతమంది మాత్రం ఎప్పటిలాగే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది మైఖేల్‌, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాల్లో కీలక పాత్రలో కనిపించింది అనసూయ. త్వరలో ఆమె నటించిన విమానం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు పుష్ప 2, ప్లాష్‌ బ్యాక్‌ వంటి ప్రాజెక్టులు అనసూయ చేతిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

 

Actress Anasuya Bharadwaj

 

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..