Ananya Nagalla: అమ్మాయిలను టార్గెట్ చేసి భయపెడుతున్నారు.. అలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..

|

Jun 25, 2024 | 7:18 AM

తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసింది. మూడు రోజుల క్రితం సిమ్ పేరుతో నేరాలకు పాల్పడుతున్నారని తనకు కాల్ చేసి భయపెట్టారని.. డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని అడిగారంటూ చెప్పుకొచ్చింది.

Ananya Nagalla: అమ్మాయిలను టార్గెట్ చేసి భయపెడుతున్నారు.. అలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..
Ananya Nagalla
Follow us on

సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని జనాలను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు రోజుకో కొత్తరకం మోసాలకు పాల్పడున్నారని.. అసలు మోసం ఇలా కూడా చేస్తారా ? అన్న స్థాయిలో నేరాలకు పాల్పడుతున్నారని.. కొన్ని ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్చున్నారు పోలీసులు. అనేక మార్గాల్లో ప్రజలను మధ్యపెట్టి దోచుకుంటున్నారు. చదువుకోని వారినే కాదు.. ఉన్నత స్థితిలో ఉన్నవారిని, యువతను ఎక్కువగా సైబర్ నేరగాళ్లు తమ మాయమాటలతో బురిడి కొట్టిస్తున్నారు. ఇప్పటికే ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడిన పలువురు సెలబ్రెటీలు, సామాన్యులు సోషల్ మీడియా ద్వారా తమకు జరిగిన మోసాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఇప్పుడు అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసింది. మూడు రోజుల క్రితం సిమ్ పేరుతో నేరాలకు పాల్పడుతున్నారని తనకు కాల్ చేసి భయపెట్టారని.. డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని అడిగారంటూ చెప్పుకొచ్చింది.

“నా ఆధార్ కార్డ్ ఉపయోగించి ఒక సిమ్ తీసుకుని దాని నుంచి చాలా ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ క్లియరెన్స్ కూడా తీసుకోవాలని అంటే సరే అన్నాను. తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయండి అంటూ స్కైప్ ద్వారా వీడియో కాల్ చేయమంటే చేశాను. వారిని చూస్తే నిజంగానే పోలీసు డ్రెస్ వేసుకుని కనిపించారు. నా సిమ్ పేరుతో మనీలాండరింగ్, డ్రగ్స్ కేసులు ఉన్నాయని నన్ను భయపెట్టారు. ఆ తర్వాత పది నిమిషాలకు వీడియో కాల్ ఆపేశారు. ఎంత కమీషన్ తీసుకున్నావు.. కేసు ఫైల్ చేస్తున్నాం.. జైల్లో వేస్తాం అంటూ భయపెట్టారు. వాళ్లు పంపిన డాక్యూమెంట్స్ అఫీషియల్ గా కనిపించాయి.

అకౌంట్స్ ఎన్ని వాడుతున్నారు అంటే రెండు అని చెప్పాను. కొంత అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేయాలని అడుగుతూ థర్ట్ పార్టీ అకౌంట్ నెంబర్ పంపించారు.దీంతో నాకు డౌట్ వచ్చి క్వశ్చన్ చేస్తుంటే సరిగ్గా స్పందించలేదు. వెంటనే గూగుల్ చేస్తే అది ఫ్రాడ్ అని తెలిసింది. వారిపై గట్టిగా అరిస్తే నా మీద అరిచారు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెబితే వెంటనే కాల్ కట్ చేశారు. ఇలా చాలా మందిని బెదిరిస్తున్నారని తెలిసింది. అమ్మాయలను టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి” అంటూ చెప్పుకొచ్చింది అనన్య నాగళ్ల. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో వైరలవుతుండగా.. నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.