AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను పెళ్లి చేసుకోవాలంటే మెసేజ్ చేయండి.. హీరోయిన్ క్రేజీ కామెంట్స్

ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని ప్రతి కుర్రాడు కోరుకునేవాడు.. అంతలా తన అందంతో మెప్పించింది. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆతర్వాత ఓ టీవీ షోలో షాకింగ్ లుక్ లో కనిపించింది

నన్ను పెళ్లి చేసుకోవాలంటే మెసేజ్ చేయండి.. హీరోయిన్ క్రేజీ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2026 | 6:30 PM

Share

సినీ సెలబ్రెటీలు సినిమాల్లో కనిపించినంతగా సుఖంగా ఉండదు. చాలా మంది సినిమా వాళ్లు వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటు ఉంటారు. చాలా మంది డిప్రషన్స్ తో, మరికొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ కెమెరా ముందు మాత్రం అవేమి కనిపించకుండా తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. తాజా ఓ నటి కూడా తన జీవితంలో ఎదుర్కున్న సమస్యలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ఓ అందాల తార తన జీవితంలోని చేదు అనుభవాలను పంచుకుంది. ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఆమె.. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించి మంచి విజయాలను అందుకుంది ఈ భామ.. కానీ ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యింది. అనారోగ్య సమస్య కారణంగా గతంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ఇప్పుడు తిరిగి కోలుకుంటుంది ఆమె..

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

ఆమె మరెవరో కాదు.. ఆనందం సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తుంపు తెచ్చుకున్న రేఖా వేద వ్యాస్. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆనందం సినిమా తర్వాత ఒకటో నెంబర కుర్రాడు, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, నాయుడమ్మ, నిన్న నేడు రేపు తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగానే చేరువైంది. కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. అయితే ఉన్నట్టుండి సినిమాల నుంచి మాయం అయ్యింది ఈ క్రేజీ హీరోయిన్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

2012 తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు రేఖ. అయితే ఆ మధ్యన కొన్ని టీవీ షోలతో పాటు ఇంటర్వ్యూలకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. అలాగే తన పెళ్లి గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మంచి అబ్బాయి దొరకలేదు.. దొరికితే కచ్చితంగా చేసుకుంటా.. అని తెలిపింది. మంచి అబ్బాయిలు ఉంటే నాకు మెసేజ్ చేయండి పెళ్లి చేసుకుంటా అని సరదాగా చెప్పుకొచ్చింది రేఖ. “ఇండియాలో నేను, సల్మాన్ ఖాన్ ఇద్దరం సింగిల్‌గానే మిగిలిపోతామేమో అనిపిస్తుంది. గతంలో ఒకరిని ఇష్టపడ్డాను. కానీ నా మనసులోని మాట ఆయనకు చెప్పలేదు. సిగ్గు, భయం, చెప్పితే ఎలా స్పందిస్తారో అనే సందేహంతో ఆ ప్రేమను వ్యక్తపరచలేకపోయాను. ఆ తర్వాత నాకు నచ్చిన వ్యక్తి దొరకలే అంటూ చెప్పుకొచ్చింది ఆనందం రేఖ. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెట్టింట యాక్టివ్ గా ఉండే రేఖ తన గ్లామరస్ ఫొటోలతో నెటిజన్స్ అవాక్ అయ్యేలా చేస్తుంది.

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

View this post on Instagram

A post shared by @anandam_rekha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us