AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Shankar: ఆ స్టార్ హీరో జోడిగా శంకర్ కూతురు.. టాలీవుడ్‏లో అమ్మాడి జోరు.. అస్సలు తగ్గట్లేదుగా..

ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఇన్నాళ్లు తమిళంలో వరుస హిట్స్ అందుకున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఆమె నటించి తొలి తెలుగు సినిమా భైరవం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్ల సమాచారం.

Aditi Shankar: ఆ స్టార్ హీరో జోడిగా శంకర్ కూతురు.. టాలీవుడ్‏లో అమ్మాడి జోరు.. అస్సలు తగ్గట్లేదుగా..
Aditi Shankar
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2025 | 10:12 AM

Share

డైరెక్టర్ శంకర్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అదితి శంకర్. నటిగానే కాకుండా సింగర్ గానూ రాణిస్తుంది. తమిళంలో వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న ఈ అమ్మడు.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం భైరవం. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మే 30న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది. దీంతో ఇప్పుడు తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంటున్నట్లు సమాచారం. తాజాగా అదితికి మరో క్రేజ్ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.

మాస్ మాహారాజ రవితేజ సరసన అదితి శంకర్ ఛాన్స్ కొట్టేసినట్లు టాక్. రవితేజ హీరోగా డైరెక్టర్ కిషోర్ తిరుమల ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాస్ జాతర చిత్రంలో నటిస్తున్న రవితేజ.. ఈ ప్రాజెక్ట్ పూర్తికాగానే కిషోర్ తిరుమల మూవీ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీలో రవితేజ సరసన అదితి శంకర్ కనిపించనుందని సమాచారం. ఇంతకు ముందు ఈ ప్రాజెక్ట్ కోసం కేతిక శర్మ, మమితా బైజు, కయాదు లోహార్ పేర్లు వినిపించాయి. ఇక ఇప్పడు అదితి శంకర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ మూవీలో రవితేజ జోడిగా అమ్మాడి పేర దాదాపు ఖరారైందని టాక్. దీంతో తొలి చిత్రం హిట్ తర్వాత వెంటనే స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసింది అదితి.

అలాగే ఇప్పుడిప్పుడే అదితికి తెలుగులో ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. రవితేజ సినిమాతోపాటు మరిన్ని చిత్రాలను ఈ అమ్మడు లైన్లో పెట్టినట్లు సమాచారం. డాక్టర్ చదువు పూర్తి చేసిన అదితి… నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. నటిగానే కాకుండా సింగర్ గానూ ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!